జబర్దస్త్ ఆర్టిస్ట్ రచ్చరవికి కారు ప్రమాదంలో గాయాలు.. ఆయనేమన్నారంటే?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జబర్దస్త్ ద్వారా భారీగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో రచ్చ రవి కూడా ఒకరు.

 Jabardast Artist Racha Ravi Got Injured Road Accident , Jabardasth, Racha Ravi,-TeluguStop.com

జబర్దస్త్ కమెడియన్ గా విపరీతమైన పాపులారిటీని సంపాదించుకున్నాడు రచ్చ రవి.ఇదివరకు జబర్దస్త్ లో కామెడీ చేస్తూ ప్రేక్షకులను నవ్వించిన రచ్చ రవి ఆ తర్వాత జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే.అయితే మొదట్లో చమ్మక్ చంద్ర స్కిట్ లో చేస్తూ బాగా ఫేమస్ అయ్యాడు.మరి ముఖ్యంగా తీసుకోలేదా లక్ష రూపాయల కట్నం అన్న డైలాగ్ తో బాగా ఫేమస్ అయ్యాడు.

Telugu Apparao, Chammak Chandra, Jabardast, Jabardasth, Racha Ravi, Road-Movie

మొదట్లో చమ్మక్ చంద్ర టీమ్ లో చేసిన రచ్చ రవి ఆ తర్వాత కొత్త టీం లీడర్ గా మారి అప్పారావుతో కలిసి కామెడీ చేశారు.ఆ తర్వాత జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన రచ్చ రవి వెండితెర పై సినిమాలలో చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు.ఇదిలా ఉంటే ఇటీవలే జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి రోడ్డు ప్రమాదంలో గాయాలు పాలయ్యాడు అంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.సూర్యాపేట మునగాల వద్ద కారు అదుపుతప్పిన డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపించాయి.

అయితే ఈ ప్రమాదం వార్తలపై తాజాగా జబర్దస్త్ కమెడియన్ రచ్చ రవి స్పందిస్తూ ఆ విషయంపై క్లారిటీ ఇచ్చారు.

Telugu Apparao, Chammak Chandra, Jabardast, Jabardasth, Racha Ravi, Road-Movie

తనకు అలాంటిదేం జరగలేదని ఆ వార్తలను కొట్టిపారేశారు.తనకు ఏమీ కాలేదని రచ్చ రవి అభిమానులకు ఫోన్ చేసి చెప్పారు.పూణెలో షూటింగ్ జరుపుకుని క్షేమంగా ఇంటికి తిరిగి వచ్చినట్లు వివరించారు.

తాను ఫ్లైట్‌లోనే హైదరాబాద్‌కు వచ్చినట్లు చెప్పారు.అలాగే నేడు జరగనున్న వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్‌కు కూడా వెళ్తున్నానని రచ్చరవి క్లారిటీ ఇచ్చారు.

అభిమానుల ఆశీస్సులు తనకెప్పుడూ ఉంటాయని రచ్చ రవి తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube