వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్..?

జబర్దస్త్ యాంకర్ రష్మీకి కుక్కలంటే చాలా ఇష్టం అనే సంగతి తెలిసిందే.జంతువులను ఎంతో ప్రేమించే రష్మీ జీవహింస చేయరాదని పలు సందర్భాల్లో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.

 Jabardast Anchor Rashmi Goutham Post About Treet-TeluguStop.com

రష్మీ కుక్కలకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని తన పోస్టులో పేర్కొన్నారు.ఒక వీడియోలో వీధి కుక్క గిన్నెలో ఉన్న ఆహారం నోటితో తీసుకొని తన పిల్లలకు పెడుతున్న వీడియోను ఒక నెటిజన్ పోస్ట్ చేయగా ఆ పోస్ట్ గురించి రష్మీ స్పందిస్తూ మనుషులకే కాదు జంతువులకు కూడా ఫీలింగ్స్ ఉంటాయని పేర్కొన్నారు.

మూగజీవాలపై ప్రేమను కురిపించే రష్మీ మూగజీవాలను రక్షించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సంగతి తెలిసిందే.ఎవరైనా మూగజీవాలను హింసిస్తే కూడా రష్మీ పలు సందర్భాల్లో బాధ పడటంతో పాటు మూగజీవాలను హింసించవద్దని కీలక సూచనలు చేసిన సంగతి తెలిసిందే.

 Jabardast Anchor Rashmi Goutham Post About Treet-వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి.. రష్మీ ఎమోషనల్ పోస్ట్..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

యానిమల్ లవర్ అయిన రష్మీ తన ఇంట్లో బంబల్ అనే కుక్కను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్నారు.

మరోవైపు బుల్లితెరపై ఎక్స్ట్రా జబర్దస్త్ షోతో బిజీగా ఉన్న రష్మీ గౌతమ్ ఈ మధ్య కాలంలో ఇతర ఛానెళ్లలో ప్రసారమవుతున్న ఈవెంట్లలో కూడా పాల్గొనడంతో పాటు సందడి చేస్తున్నారు.సుధీర్ రష్మీ జోడీకి సైతం ప్రేక్షకుల్లో ఎంతో క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.అయితే ఈ మధ్య కాలంలో సుధీర్ రష్మీ జోడీ కలిసి ప్రోగ్రామ్ లలో, ఈవెంట్లలో పాల్గొనడం లేదు.

మరోవైపు రష్మీ నందుతో కలిసి బొమ్మ బ్లాక్ బస్టర్ అనే సినిమాలో నటించారు.

హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాని రష్మీ గౌతమ్ ఈ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు.

ఇప్పటికే విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.బొమ్మ బ్లాక్ బస్టర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన ప్రకటన వెలువడాల్సి ఉంది.

#Rashmi Twitter #Rashmi #Street Dogs #Emotional Post

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు