అనసూయ, యాంకర్ శివ వివాదం అసలు విషయం ఇదట.. ఆది మాస్టర్‌ స్కెచ్‌

గత వారం జబర్దస్త్‌ వారు విడుదల చేసిన ఈ వారం ఎపిసోడ్‌ ప్రోమో ఎంతగా చర్చనీయాంశం అయ్యిందో చెప్పనక్కర్లేదు.యూట్యూబ్‌ లో ఇంకా ట్రెండింగ్‌ లోనే ఉన్న ఈ వీడియో కు సంబంధించి జబర్దస్త్‌ టీమ్‌ నుండి క్లారిటీ తీసుకునే ప్రయత్నం చేశాం.

 Jabardast Anasuya And Anchor Shiva Issue Clarity-TeluguStop.com

వారు అనధికారికంగా అది ఫ్రాంక్ అని తేల్చి చెప్పారు.అది ఫ్రాంక్ అనే విషయం అందరికి తెల్సిందే.

అలాంటివి జరిగినప్పుడు కెమెరాలు ఆఫ్‌ చేయడం లేదంటే ఆ వివాదాన్ని చూపించకుండా ఉండటం చేస్తారు.కాని ప్రోమోలో వేశారంటే ఖచ్చితంగా ఫ్రాంక్‌ అయ్యి ఉంటుందని చాలా మంది అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

 Jabardast Anasuya And Anchor Shiva Issue Clarity-అనసూయ, యాంకర్ శివ వివాదం అసలు విషయం ఇదట.. ఆది మాస్టర్‌ స్కెచ్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అందరికి తగ్గట్లుగానే జబర్దస్త్‌ టీమ్‌ వారు కూడా నిజంగానే అది ఫ్రాంక్‌ అంటూ సమాచారం ను అనధికారికంగా ఇవ్వడం జరిగింది.వారు చెప్పిన దాని ప్రకారం యాంకర్‌ శివ ఎన్నో వివాదాస్పద ఇంటర్వ్యూలు చేశాడు.

ఇది కూడా అలా చేసే ప్రయత్నం.అతడికి ఇదే పని అంటూ హైపర్‌ ఆది ఆ స్టేజ్ పై యాంకర్‌ శివ పై పంచ్‌ లు వేయడంతో పాటు ఆ తర్వాత అనసూయను కూల్‌ చేస్తాడట.

ఈ మొత్తం వ్యవహారం చాలా ఫన్‌ గా ఉంటుందని.అదే సమయంలో అనసూయ బయటకు వెళ్లిన సమయంలో ఆసక్తిగా కూడా ఉంటుందని వారు చెబుతున్నారు.ప్రేక్షకులతో పాటు మేము కూడా గురువారం ఎపిసోడ్‌ కోసం ఎదురు చూస్తున్నాం అని.షూటింగ్‌ సమయంలో కంటే జబర్దస్త్‌ ను బుల్లి తెరపై చూస్తేనే మజా వస్తుందని వారు చెబుతున్నారు.హైపర్ ఆది మరియు అనసూయల మద్య ఉండే రెగ్యులర్‌ రొమాన్స్ తో పాటు కామెడీ కూడా ఈ స్కిట్‌ లో ఉంటుందని వారు చెబుతున్నారు.ఇటీవల కాలంలో జబర్దస్త్ రేటింగ్‌ కాస్త తగ్గింది.

షో ను జనాలు చూసేందుకు కాస్త ఆసక్తి తగ్గినట్లుగా అనిపిస్తుంది.కొన్ని వివాదాలు మరి కొన్ని ఛానెల్స్‌ లో ప్రసారం అవుతున్న కామెడీ స్కిట్‌ ల కారణంగా జబర్దస్త్‌ రేటింగ్‌ తగ్గింది.

కాస్త ఆధరణ తగ్గినట్లుగా అనిపిస్తున్నా అసలు షో కు ఉన్న క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

#AnasuyaSiva #Hyper Aadi #JabardastPromo #Anasuya #Anchor Shiva

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు