జాతిరత్నాలు హిట్టైనా వాళ్లు సంతోషంగా లేరా..?

ఈ మధ్య కాలంలో మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు మినహా చిన్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్టైన దాఖలాలు లేవు.అయితే శివరాత్రి కానుకగా థియేటర్లలో విడుదలైన జాతిరత్నాలు సినిమా మాత్రం చిన్న సినిమాగా విడుదలై అంచనాలకు అందని స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్టైంది.

 Distributors Are Not Happy With Jaati Ratnalu Movie For Less Screens , Jaati Rat-TeluguStop.com

ఈ సినిమాకు పోటీగా శ్రీకారం, గాలిసంపత్ సినిమాలు విడుదల కాగా కలెక్షన్లలో మాత్రం జాతిరత్నాలు సినిమానే పైచేయిగా నిలిచింది.

అయితే జాతిరత్నాలు సినిమాకు బ్లాక్ బస్టర్ హిట్టైనా డిస్ట్రిబ్యూటర్లు మాత్రం సంతోషంగా లేరని తెలుస్తోంది.11వ తేదీన శ్రీకారం, జాతిరత్నాలు, గాలిసంపత్ లతో పాటు రాబర్ట్ అనే డబ్బింగ్ సినిమా విడుదలైంది.12వ తేదీన లవ్ లైఫ్ & పకోడి సినిమా విడుదలైంది.మొత్తం 5 సినిమాలు విడుదల కావడంతో జాతిరత్నాలు సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదు.జాతిరత్నాలు విడుదలైన అన్ని థియేటర్లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.

Telugu Crore Rupees, Block Buster, Distributors, Dollar Mark, Full, Jati Ratnalu

థియేటర్ల సంఖ్య పెరిగితే కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని డిస్ట్రిబ్యూటర్లు భావిస్తున్నారు.ఏ సెంటర్లు మినహా మిగిలిన సెంటర్లలో జాతిరత్నాలు సినిమాకు థియేటర్లు ఎక్కువగా లభించడం లేదు.సోమవారం నుంచి జాతిరత్నాలు సినిమాకు థియేటర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది.ఈ సినిమా కలెక్షన్ల పరంగా కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాకు మంచి కలెక్షన్లు వస్తాయి.

నిర్మాతగా నాగ్ అశ్విన్ ఖాతాలో ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ చేరిందని చెప్పవచ్చు.

ఓవర్సీస్ లో ఈ సినిమా మాస్టర్ సినిమా కలెక్షన్లను క్రాస్ చేసిందని సమాచారం.ఫుల్ రన్ లో ఈ సినిమా హాఫ్ మిలియన్ డాలర్ మార్కును అందుకుంటుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 30 కోట్ల రూపాయలకు పైగా కలెక్షన్లు రాబట్టే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube