దేవుడా.. బాహుబలిని జాతిరత్నాలు మూవీ బీట్ చేసిందా..?

ఈ మధ్య కాలంలో కొన్ని సినిమాలు చిన్న సినిమాలుగా విడుదలై ఊహించని స్థాయిలో కలెక్షన్లు రాబడుతున్నాయి.ఈ నెల 11వ తేదీన జాతిరత్నాలు సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.

 Jathi Rantalu Movie Beats Bahubali 2 Movie Records , Baahubali 2, Jathi Ratnalu,-TeluguStop.com

ఈ సినిమా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన రెండో సినిమా కాగా విడుదలకు ముందే సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడటంతో పాటు సినిమాకు రిలీజ్ కు ముందే పాజిటివ్ టాక్ వచ్చింది.సినిమా విడుదలై వారం రోజులైనా ఈ సినిమాకు థియేటర్ల సంఖ్య తగ్గడం లేదు.

శ్రీకారం, గాలిసంపత్ సినిమాలను మించి కలెక్షన్లను రాబట్టిన ఈ సినిమా కొన్ని థియేటర్లలో బాహుబలి కలెక్షన్లను కూడా బీట్ చేయడం గమనార్హం.వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా నిజంగానే బాహుబలి సినిమా రికార్డులకు జాతిరత్నాలు చెక్ పెడుతూ ఉండటం గమనార్హం.2017 సంవత్సరం ఏప్రిల్ నెలలో బాహుబలి 2 విడుదలైంది.ఈ సినిమా ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని థియేటర్లలో ఒకటైన సుదర్శన థియేటర్లో 36 లక్షల రూపాయల కలెక్షన్లను సాధించింది.

Telugu Bahubali, Baahubali, Block Buster, Jathi Ratnalu, Jatiratnalu, Rtc Cross

అయితే జాతిరత్నాలు సినిమా తొలివారం ఏకంగా 38.63 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించి ఆ రికార్డును బ్రేక్ చేసిందని చెప్పాలి.అయితే బాహుబలి 2 సినిమాతో పోలిస్తే ఇప్పటికి టికెట్ రేట్లు భారీగా పెరిగాయి.ఆ కారణం వల్ల బాహుబలి 2 కలెక్షన్లను జారిరత్నాలు బీట్ చేసినా ఇప్పటి టికెట్ రేట్ల ప్రకారం చూస్తే మాత్రం బాహుబలి 2 సినిమాదే రికార్డు అని చెప్పాలి.

అయితే చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు అరుదైన రికార్డులను ఖాతాలో వేసుకుంది.

వెండితెరపై బ్లాక్ బస్టర్ హిట్టైన జాతిరత్నాలు బుల్లితెరపై, ఓటీటీలో కూడా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కథ లేకపోయినా కడుపుబ్బా నవ్వించే కథనం ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని జాతిరత్నాలు మూవీ ప్రూవ్ చేయడం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube