నాగ అశ్విన్ లేకపోతే జాతిరత్నాలు లేదా? అసలు విషయం ఏంటంటే?

డైరెక్టర్ కె వి అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘జాతిరత్నాలు‘.ఈ సినిమాలో నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించగా.ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించింది.ఇక ఈ సినిమా ఈ నెల 11న విడుదలైన సంగతి తెలిసిందే.ప్రేక్షకుల నుండి ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.భారీ బడ్జెట్ తో థియేటర్ లలో ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.

 Jaati Ratnalu Team About Their Hardwork , Jathi Ratnalu, Nag Ashwin, Abhinav, T-TeluguStop.com

ఇక ఈ సినిమా గురించి సినిమాటోగ్రాఫర్ సిద్ధం మనోహర్ మాట్లాడుతూ.ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి సినిమాలో తన జాతి రత్నాలు సినిమాకు నాగ్ అశ్విన్ ఎక్కువ కష్టపడ్డారని తెలిపాడు.ఆయన లేకపోతే ఈ సినిమా లేదని చెప్పుకొచ్చాడు.ఇక మనోహర్ తనది నెల్లూరు అంటూ, నాగ్ అశ్విన్ కార్పొరేట్, వెడ్డింగ్ వీడియోస్ ను డైరెక్ట్ చేసే ప్రాసెస్ లో ఉన్న సమయంలో తాను చాలా వర్క్ నేర్చుకున్నానని తెలిపాడు.

Telugu Abhinav, Jaati Ratnalu, Jathi Ratnalu, Nag Ashwin, Priyadarshi, Tollywood

ఎవడే సుబ్రహ్మణ్యం సమయంలో తను దర్శకత్వ ప్రయత్నాలు చేశానంటూ, డైరెక్షన్ లోకి వెళితే సినిమాటోగ్రఫీ చేయలేవని నాగ్ అశ్విన్, స్వప్న తనకు కౌన్సిలింగ్ ఇచ్చేవారని తెలిపాడు.ఇక మహానటి సినిమా కు తను అసిస్టెంట్ కెమెరామెన్ గా చేశాడట‌.అమ్మ దీవెన సినిమాతో పాటు ఓ చిన్న సినిమాకు కెమెరామెన్ గా పని చేశాడట.ఇక ఇటీవలే జాతి రత్నాలు సినిమా పెద్ద హిట్ గా నిలిచిందంటూ, ప్రస్తుతం మరో రెండు సినిమాలలో చేస్తున్నానని తెలిపాడు‌.

అంతేకాకుండా జాతి రత్నాలు ఎడిటర్ అభినవ్ మాట్లాడుతూ.ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసానని తెలిపాడు.

ఇక వెడ్డింగ్ ఫిలిమ్స్, కమర్షియల్ యాడ్స్ ని సరదాగా షూట్ చేసి ఎడిట్ చేసేవాడట.అంతేకాకుండా ఓ వెబ్ సిరీస్ ఎడిటర్ గా కూడా తనకు పెద్ద ప్రాజెక్ట్ అని తెలిపాడు.

ఇక జాతి రత్నాలను ఎడిటర్ గా చేశానంటూ తనకు డైరెక్టర్ కావాలని లక్ష్యం ఉందని తెలిపారు.ఎడిటర్ లలో డైరెక్టర్ అయిన వారు ఉన్నారని, వాళ్లకు ఎడిటింగ్ లో మంచి స్కిల్ ఉందని, కథను చెప్పడంలో, క్యారెక్టర్స్ ని చూపించడం లో ఎడిటింగ్ ద్వారానే ఎక్కువ తెలుస్తాయని చెప్పుకొచ్చాడు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube