పాన్ ఇండియా బ్యూటీని ఫోకస్ చేసిన జాతిరత్నాలు దర్శకుడు!

ఈ ఏడాది మంచి కామెడీతో విడుదలైన సినిమా జాతి రత్నాలు.ఈ సినిమాకు డైరెక్టర్ అనుదీప్ కె.వి దర్శకత్వం వహించి మంచి గుర్తింపు అందుకున్నాడు.అంతేకాకుండా స్టార్ హీరోల నుండి మంచి ప్రశంసలు అందుకున్నాడు.2016లో విడుదలైన పిట్టగోడ సినిమాతో తొలిసారిగా దర్శకత్వం వహించి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు.కానీ ఈ సినిమా అంత సక్సెస్ ను అందుకోలేకపోయింది.

 Jaathi Ratnalu Director Kv Anudeep Focus On Pan India Star Heroine-TeluguStop.com

కానీ జాతి రత్నాలు సినిమాతో మాత్రం ఎనలేని క్రేజ్ సంపాదించుకున్నాడు అనుదీప్.ఇదిలా ఉంటే ఈసారి ఏకంగా పాన్ ఇండియా బ్యూటీపై ఫోకస్ పెట్టాడు.

ఇక తన దర్శకత్వంలో మూడో సినిమాకు సిద్ధమవుతున్నాడు అనుదీప్.అది కూడా స్వప్న సినిమాస్ బ్యానర్ లో ఓ సినిమాను ఫిక్స్ చేశాడట.ఇక ఈ సినిమాకు కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ ను తీసుకోనున్నట్లు తెలుస్తుంది.దీంతో ఈ సినిమాకు హీరోయిన్ గా ఎవరిని పెట్టాలా అని అనుకున్న అనుదీప్ మొత్తానికి పాన్ ఇండియా హీరోయిన్ పై దృష్టి పెట్టాడు.

 Jaathi Ratnalu Director Kv Anudeep Focus On Pan India Star Heroine-పాన్ ఇండియా బ్యూటీని ఫోకస్ చేసిన జాతిరత్నాలు దర్శకుడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అది కూడా ఎవరో కాదు ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా పెద్ద సినిమాలతో దూసుకుపోతున్న రష్మిక మందన.

Telugu Director, Jaathi Ratnalu, Kv Anudeep, Pan India Star Heroine-Movie

అల్లు అర్జున్ నటించిన పాన్ ఇండియా మూవీ పుష్ప సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది రష్మిక మందన.ఇక ఈమెను కలిసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాడట అనుదీప్.ఇటీవలే ఆమెకు తాను తీయబోయే సినిమా కథ గురించి కూడా చెప్పాడని తెలుస్తుంది.

ప్రస్తుతం పెద్ద పెద్ద ప్రాజెక్టులతో బిజీగా ఉన్నా రష్మిక మందన చిన్న సినిమాలలో కూడా నటించడానికి ముందుకు వస్తుంది.ఇక అనుదీప్ దర్శకత్వంలో కూడా వస్తున్న మూడో సినిమాకు ఓకే చెప్పేటట్లు ఉందని టాక్ వినిపిస్తుంది.

అన్నీ కుదిరితే రెండు నెలల్లో ఈ సినిమా సెట్స్ లోకి వెళ్లనున్నట్లు సమాచారం.మొత్తానికి మొదట్లోనే పాన్ ఇండియా హీరోయిన్ పై ఫోకస్ పెట్టిన అనుదీప్ ఎటువంటి సక్సెస్ ను అందిస్తాడో చూడాలి.

#PanIndia #KV Anudeep #Jaathi Ratnalu #Director

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు