ఢీలా పడ్డ జాను.. కష్టమే అంటోన్న ఫ్యాన్స్!  

Jaanu To Have Tough Days Ahead - Telugu Collections, Dil Raju, Jaanu, Samantha, Sharwanand, Telugu Movie News

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత జంటగా నటించిన లేటెస్ట్ మూవీ జాను ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్‌ను సొంతం చేసుకుంది.తమిళంలో సూపర్ హిట్ అయిన 96 చిత్రానికి ఇది తెలుగు రీమేక్.

Jaanu To Have Tough Days Ahead

అయితే ఈ సినిమాకు పాజిటివ్ టాక్, రివ్యూలు లభించినా కమర్షియల్ అంశాలు ఎక్కడా లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఢీలా పడింది.

రిలీజ్ రోజు పర్వాలేదనిపించుకున్న కలెక్షన్లు, వీకెండ్ ముగిసే వరకు కంటిన్యూ అయ్యాయి.

కానీ మండే టెస్టులో ఈ సినిమా పూర్తిగా ఫెయిల్ అయ్యింది.అంతంత మాత్రంగా వచ్చే ప్రేక్షకులు ఈ సినిమాకు వస్తుండగా, మండే నుండి వారు కూడా రావడం తగ్గించారు.

దీంతో ఈ సినిమాకు రానున్న రోజుల్లో ఈ కలెక్షన్లు మరింత పడిపోయే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.ఇక ఫిబ్రవరి 14న విజయ్ దేవరకొండ నటిస్తున్న వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్‌కు రెడీ కావడంతో జాను కలెక్షన్లపై మరింత ప్రభావం చూపుతుందని అంటున్నారు.

మరి జాను సినిమా దిల్ రాజుకు మరో ఫ్లాప్ మూవీని మిగిలంచనుందా? ఈ సినిమాతో కూడా రాజుగారికి రీమేక్ తంటాలు తప్పవా అనే ప్రశ్నలకు సమాధానం మరికొద్ది రోజుల్లో తెలుస్తోంది.

#Samantha #Jaanu #Collections #Dil Raju #Sharwanand

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Jaanu To Have Tough Days Ahead Related Telugu News,Photos/Pics,Images..