దుకాణం మూసేసిన జాను.. అడ్డంగా బుక్కయిన బయ్యర్లు

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటించిన రీసెంట్ మూవీ జాను ఇటీవల రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా వచ్చిన ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

 Jaanu Closing Business Leaves Buyers In Huge Loss-TeluguStop.com

ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపించడంతో ఈ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందా అని అందరూ అనుకున్నారు.

కాగా ఈ సినిమా చాలా బోరింగ్‌గా ఉండటంతో తెలుగు జనాలకు ఈ సినిమా ఎక్కలేదు.

దీంతో ఈ సినిమా కమర్షియల్ పరంగా చాలా దారుణమైన ఫలితాన్ని రాబట్టింది.ఈ సినిమా టోటల్ రన్‌లో ప్రపంచవ్యాప్తంగా కేవలం రూ.8.18 కోట్లు మాత్రమే వసూలు చేసింది.అయితే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఈ సినిమాను ఏకంగా రూ.21 కోట్లకు బయ్యర్లు కొనుగోలు చేయడంతో వారు భారీ నష్టాలను చవిచూశారు.

ఈ సినిమాను తమిళంలో తెరకెక్కించిన ప్రేమ్‌కుమార్ తెలుగులోనూ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు.ఇకఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా టోటల్ రన్‌లో వసూలు చేసిన కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.83 కోట్లు

సీడెడ్ – 0.88 కోట్లు

నెల్లూరు – 0.24 కోట్లు

కృష్ణా – 0.57 కోట్లు

గుంటూరు – 0.62 కోట్లు

వైజాగ్ – 0.93 కోట్లు

ఈస్ట్ – 0.50 కోట్లు

వెస్ట్ – 0.36 కోట్లు

టోటల్ ఏపీ+తెలంగాణ – 6.93 కోట్లు

రెస్టాఫ్ ఇండియా – 0.50 కోట్లు

ఓవర్సీస్ – 0.75 కోట్లు

టోటల్ వరల్డ్‌వైడ్ – 8.18 కోట్లు

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube