జాను 5 రోజుల కలెక్షన్లు.. డిజాస్టర్ కన్ఫమ్  

Jaanu 5 Days Collections-jaanu,prem Kumar,samantha,sharwanand,tollywood Gossips

యంగ్ హీరో శర్వానంద్, స్టార్ బ్యూటీ సమంత కలిసి నటించిన తాజా చిత్రం జాను ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద మిక్సిడ్ టాక్‌ను సొంతం చేసుకుంది.తమిళంలో సూపర్ సక్సెస్ అయిన 96 చిత్రానికి రీమేక్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు తెలుగులో అంత ఆదరణ లభించలేదని చిత్ర వసూళ్లు చూస్తే తెలుస్తోంది.

Jaanu 5 Days Collections-Jaanu Prem Kumar Samantha Sharwanand Tollywood Gossips

సమంత లాంటి స్టార్ హీరోయిన్, శర్వానంద్ లాంటి హీరో ఉన్నా, ఈ సినిమా కథ కూడా బాగున్నా, కథనం చాలా నెమ్మదించడంతో ప్రేక్షకులు ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపించలేదు.సినిమా రిలీజ్ రోజున మంటి వసూళ్లు సాధించినా, ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి ఈ సినిమా కలెక్షన్లు తగ్గుముఖం పట్టాయి.

ఇక వీక్ డేస్‌లో ఆ కలెక్షన్లు మరింతగా తగ్గాయి.దీంతో ఈ సినిమా 5 రోజుల్లో కేవలం రూ.6.37 కోట్లు మాత్రమే వసూళ్లు సాధించింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు క్రేజ్ తగ్గడం, విజయ్ దేవరకొండ నటించిన వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా రిలీజ్ కానుండటంతో ఈ కలెక్షన్లు మరింత దారుణంగా తగ్గే అవకాశం ఉందని చిత్ర వర్గాలు అంటున్నాయి.ఇక ఏరియాల వారీగా ఈ సినిమా 5 రోజుల కలెక్షన్లు ఈ విధంగా ఉన్నాయి.

నైజాం – 2.55 కోట్లు

సీడెడ్ – 81 లక్షలు

గుంటూరు – 55 లక్షలు

ఉత్తరాంధ్ర – 1.07 లక్షలు

ఈస్ట్ – 42 లక్షలు

వెస్ట్ – 32 లక్షలు

కృష్ణా – 45 లక్షలు

నెల్లూరు – 20 లక్షలు

టోటల్ ఏపీ+తెలంగాణ – 6.37 కోట్లు

తాజా వార్తలు