నిజంగా ముద్దుపెట్టుకోలేదంటున్న బిగ్ బాస్ కంటెస్టెంట్!

బుల్లితెరపై ప్రసారమయ్యే అతిపెద్ద రియాలిటీ షో బిగ్ బాస్ ఒకటి.ఈ షో కి ఏ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది అందరికీ తెలిసిందే.

 Bigg Boss14 Contestant Jaan Kumar Reaction On Kissing Nikki Tamboli, Bigg Boss14-TeluguStop.com

ఈ రియాలిటీ షో ద్వారా హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్ లు పలు టాస్క్ లో పాల్గొంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటారు.అంతే కాకుండా కొన్ని సార్లు బిగ్ బాస్ ఇచ్చే టాస్క్ ద్వారా ఎవరికీ తెలియనటువంటి కొన్ని రహస్య విషయాలను కూడా కంటెస్టెంట్ లు ద్వారా అభిమానులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటారు.

మరికొంతమంది కంటెస్టెంట్ లను బద్ద శత్రువులుగా, కూడా బిగ్ బాస్ మారుస్తుంది.అచ్చం ఇలాంటి సంఘటనే హిందీ బిగ్ బాస్14 వ సీజన్ లో పాల్గొన్న కంటెస్టెంట్ నిక్కీ తంబోళి, జాన్‌ కుమార్‌ల విషయంలో అదే జరిగింది.
బిగ్ బాస్ హౌస్ లో క్లోజ్ గా ఉన్న నిక్కీ తంబోళి, జాన్‌ కుమార్‌ ఇద్దరు చనువుగా ఉండడంతో వీరిద్దరి మధ్య ఏదో నడుస్తోంది అని ప్రేక్షకులు భావించారు.అయితే అలాంటి బంధానికి బ్రేక్ వేస్తూ జాన్ హౌస్ నుంచి బయటకు వచ్చేశారు.

తర్వాత నెల రోజులకు కూడా బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.అయితే ఈ ఇద్దరు కంటెస్టెంట్ లు హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత వీరిద్దరి మధ్య వివాదం మరింత రేకెత్తించింది.

బిగ్ బాస్ హౌస్ లో జాన్ కావాలనే తనను ముద్దు పెట్టుకున్నాడు అంటూ ఆమె ఆరోపించారు.నిక్కి మాటలకు జాన్ తీవ్రస్థాయిలో ఖండించారు.

Telugu Biggboss, Bigg Boss, Jaan Kumar, Nikki Tamboli, Nikkitamboli, Tv-Movie

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన జాన్ అసలు నిక్కీ ని నేను ప్రేమించడమే లేదని, తనను ముద్దు పెట్టుకోలేదని తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదంటూ ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ విషయంలో స్పందించిన నిక్కీ తల్లి మాట్లాడుతూ… నా కూతురికి ఇష్టం లేకపోయినా జాన్ వెంటపడేవాడు.అప్పటికి తన కూతురు అన్నయ్య అని పిలిచినప్పటికి కూడా తనని వేధించేవాడని పేర్కొంది.నిక్కి తల్లి మాటలకు జాన్ తల్లి స్పందిస్తూ నిక్కీ, జాన్ ఇద్దరు మంచి స్నేహితులుగా ఉండాలి అనుకున్నారు కాకపోతే ఇలాంటి విమర్శలు చేయడం ఏమాత్రం సరికాదు, నిక్కీ షో కోసమే తన కొడుకు పై ఇలాంటి విమర్శలు చేస్తోందని ఈ సందర్భంగా తల్లి స్పందించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube