బిగ్ బాస్ ను బ్యాన్ చేయాలంటున్న ప్రేక్షకులు.. కారణమిదే..?

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అనే సంగతి తెలిసిందే.ఈ భాష, ఆ భాష అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లోనూ ఈ షో వివాదాల ద్వారా పాపులర్ అవుతోంది.

 Jaan Kumar Sanu Disrespects Marathi Language In Bigg Boss Show  Jaanu Kumar, Big-TeluguStop.com

అయితే ఈ షోను విమర్శించే వాళ్లు ఎంతమంది ఉన్నారో ప్రశంసించే వాళ్లు సైతం అంతే సంఖ్యలో ఉన్నారు.అయితే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలంటూ మహారాష్ట్ర వాసులు డిమాండ్ చేస్తున్నారు.

సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షోపై సోషల్ మీడియా వేదికగా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు,

పూర్తి వివరాల్లోకి వెళితే సల్మాన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ 14లో జాన్ కుమార్ సాను అనే కంటెస్టెంట్ పాల్గొన్నాడు.ఆ షోలో పాల్గొన్న రాహుల్, నిక్కి అనే కంటెస్టెంట్లు మరాఠీ భాషలో పలు విషయాల గురించి చర్చించుకున్నారు.

అయితే జాన్ కుమార్ సాను మాత్రం తనకు అర్థం కాకూడదని వాళ్లు మరాఠీ భాషలో మాట్లాడుతున్నారని భావించాడు.వాళ్లతో వెంటనే బిగ్ బాస్ షోలో హిందీ మాట్లాడాలని మరాఠీ భాషలో మాట్లాడకూడదని కామెంట్లు చేశాడు.

కుమార్ సాను చేసిన కామెంట్లు యధాతథంగా ప్రసారమయ్యాయి.బిగ్ బాస్ షోలో మరాఠీ భాషను మాట్లాడకూడదని కుమాన్ సాను చేసిన వ్యాఖ్యలు మహార్రాష్ట్రలోని నవ్ నిర్మాణ్ సేన పార్టీతో పాటు మరికొన్ని పార్టీల నేతలకు, బిగ్ బాస్ ప్రేక్షకులకు, ప్రజలకు ఆగ్రహం తెప్పించాయి.

దీంతో టీవీ ఛానల్ ఇప్పటికే క్షమాపణ కోరుతూ మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసి ఆ లేఖను విడుదల చేసింది.

అయితే మరాఠీ బిగ్ బాస్ ప్రేక్షకులు మాత్రం బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని కోరుతున్నారు.

ఈ వివాదం సద్దుమణుగుతుందో లేదో చూడాల్సి ఉంది.మరోవైపు మరాఠీ భాష మాట్లాడవద్దని వ్యాఖ్యలు చేసిన కుమార్ సానును ఎలిమినేట్ చేయాలని.

వృత్తిరిత్యా సింగర్ అయిన కుమార్ సానుకు అవకాశాలు ఎలా వస్తాయో చూస్తామంటూ బిగ్ బాస్ ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube