జానును ఇరుకున పెట్టిన విజయ్‌ దేవరకొండ  

Jaaanu Rel;ease Date Confirm-tollywood,vijay Devarakonda

సమంత, శర్వానంద్‌ జంటగా నటించిన ’96’ రీమేక్‌ జాను చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.మొదట ఈ చిత్రాన్ని ప్రేమికుల రోజు సందర్బంగా ఫిబ్రవరి 14న విడుదల చేయాలని భావించారు.

Jaaanu Rel;ease Date Confirm-Tollywood Vijay Devarakonda

కాని అనూహ్యంగా సినిమాను వారం ముందే అంటే ఫిబ్రవరి 7నే విడుదల చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఫిబ్రవరి 14వ తారీకున వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ చిత్రం విడుదలకు రెడీగా ఉంది.

ఆ కారణంగానే ఈ చిత్రాన్ని కాస్త ముందే అంటే ఫిబ్రవరి 7న విడుదల చేయాలని నిర్ణయించారు.

తమిళంలో సెన్షేషనల్‌ హిట్‌ అయిన 96 చిత్రాన్ని ఏమాత్రం మార్చకుండా అదే దర్శకుడితో తెలుగులో దిల్‌ రాజు నిర్మిస్తున్నాడు.త్రిష పోషించిన పాత్రను సమంతతో చేయిస్తున్నారు.విజయ్‌ సేతుపతి నటించిన పాత్రను శర్వానంద్‌తో చేయిస్తున్నారు.మొత్తానికి ఈ చిత్రం ఒక స్థాయిలో ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రచారం చేస్తున్నారు.భారీ ఎత్తున అంచనాలున్న ఈ చిత్రంను ఎప్పుడెప్పుడు చూస్తామా అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

తమిళంలో మాదిరిగా ఈ చిత్రం తెలుగులో కూడా హిట్‌ అవుతుందనే నమ్మకంను సినీ వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.చిన్న బడ్జెట్‌ చిత్రంగా రూపొందిన ఈ చిత్రంను ప్రేక్షకులు తప్పకుండా ఆధరించి పెద్ద సక్సెస్‌ను అందిస్తారని నమ్మకంగా ఉన్నారు.

కాని విడుదల విషయంలో విజయ్‌ దేవరకొండ అడ్డు రావడంతో కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది ఈ చిత్రం.మరి ఈ పరిస్థితులను జాను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

తాజా వార్తలు

Jaaanu Rel;ease Date Confirm-tollywood,vijay Devarakonda Related....