అప్పుడు 100 మార్కులు ఇచ్చాడు, ఇప్పుడేమో అనుభవ రాహిత్యం అంటున్నాడు  

J.c. Diwakar Reddy Comments On Jagan Rulling Governament-j.c.support To Talk To Jagan,jagan 100 Days Rulling,jc Join In Ycp Party,tdp Leader Jc Diwakar Reddy

ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి వంద రోజుల పాలన పూర్తి చేసుకున్న సమయంలో మాజీ ఎంపీ, తెలుగు దేశం పార్టీ నాయకుడు జేసీ దివాకర్‌ రెడ్డి మాట్లాడుతూ వందకు వంద మార్కులు అంటూ చెప్పుకొచ్చాడు.అన్ని విషయాల్లో కూడా చాలా క్లియర్‌గా జగన్‌ ముందుకు సాగుతున్నాడు అంటూ జేసీ వ్యాఖ్యలు చేశాడు.

J.c. Diwakar Reddy Comments On Jagan Rulling Governament-j.c.support To Talk To Jagan,jagan 100 Days Rulling,jc Join In Ycp Party,tdp Leader Jc Diwakar Reddy-J.C. Diwakar Reddy Comments On Jagan Rulling Governament-J.c.support To Talk Jagan 100 Days Jc Join In Ycp Party Tdp Leader Jc

ఆ సమయంలో జేసీ వైకాపాలోకి జాయిన్‌ అయ్యే అవకాశం ఏమైనా ఉందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.అలాంటి జేసీ మళ్లీ ఇప్పుడు పూర్తి విరుద్దమైన వ్యాఖ్యలు చేశాడు.జగన్‌ తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తున్నాడు.జగన్‌ పాలన గురించి చెప్పాలంటే ఇంకా మరో ఆరు నెలలైనా సమయం పడుతుందంటూ ఈ సందర్బంగా జేసీ అన్నాడు.

J.c. Diwakar Reddy Comments On Jagan Rulling Governament-j.c.support To Talk To Jagan,jagan 100 Days Rulling,jc Join In Ycp Party,tdp Leader Jc Diwakar Reddy-J.C. Diwakar Reddy Comments On Jagan Rulling Governament-J.c.support To Talk Jagan 100 Days Jc Join In Ycp Party Tdp Leader Jc

జగన్‌కు అనుభవం లేకపోవడం వల్లే పాలన సరిగా సాగడం లేదన్నాడు.ఆయనకు మంచి చెడు చెప్పే వారు లేకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతుందని ఈ సందర్బంగా జేసీ అన్నాడు.జగన్‌కు తాను సలహాలు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాను అని, ఆయనకు తన సలహాలు అవసరం అయితే ఖచ్చితంగా ఇస్తానంటూ పేర్కొన్నాడు.

జేసీ వ్యాఖ్యలు అంతా గందరగోళంగా ఉన్నాయంటూ సొంత పార్టీ నాయకులు మరియు అధికార పార్టీ నాయకులు జుట్టు పీక్కుంటున్నారు.