జగన్ తొందరపడ్డాడా ? అందుకేనా ఈ గందరగోళం

వైసీపీ అధినేత సీఎం జగన్ ఏదో చేయాలని కంగారుపడి ఇంకేదో చేసినట్టుగా పరిస్థితులు తారుమారయ్యాయి.రాజధానిగా అమరావతి ఏపీ రాజధానిగా ప్రజలు దాదాపుగా అంగీకరించినా జగన్ మాత్రం ససేమిరా అంటూ ఆ ప్రాంతంలో రాజధాని నిర్మాణము చేపట్టేందుకు ససేమేరా అంటూ రాజధాని ఏర్పాటు, రాష్ట్ర సమగ్రాభివృద్ధిపై నియమించిన జీఎన్ రావు కమిటీని నియమించినా ఆ కమిటీ రిపోర్టు వచ్చేవరకు వేచి చూడడం మానేసి రాష్ట్రంలో మూడు రాజధానులు అంటూ ప్రకటించి అనవసర గందరగోళానికి తెరలేపాడు అనే విమర్శలు ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి.

 Iyr Krishna Rao Comments On Jagan Mohan Reddy-TeluguStop.com

ఆ తొందరపాటు కారణంగానే ఇప్పుడు జీఎన్ రావు కమిటీ, బోస్టన్ కమిటీ తమ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించినా, వాటికి విలువ లేకుండా పోయింది.

జగన్ తొందరపడ్డాడా ? అందుకేనా ఈ

టిడిపి అధినేత చంద్రబాబు అయితే అవి ఒట్టి కాయితాలు అంటూ కొట్టిపారేస్తున్నారు.దీనంతటికీ కారణం జగన్ తొందరపాటు ప్రకటన కారణం.అదే కమిటీ రిపోర్టు వచ్చేవరకు మూడు రాజధానులు ప్రకటన చేయకుండా జగన్ ఉండి ఉంటే ఇప్పుడు రాజకీయ వాతావరణం వేరేలా ఉండేది.

కమిటీ సిఫార్సులను తాను అమలు చేస్తున్నాను అంతే తప్ప ఇందులో తన సొంత రాజకీయం ఏమీ లేదు అనే విషయాన్ని జగన్ ధైర్యంగా చెప్పే అవకాశం ఏర్పడేది.

జగన్ తొందరపడ్డాడా ? అందుకేనా ఈ

కానీ ఇప్పుడు ఆ అవకాశం లేదు సరికదా అనవసర విమర్శలు జగన్ ఎదుర్కోవాల్సి వస్తోంది.ఇదే విషయంపై ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు కూడా జగన్, ఆయన మంత్రి మండలి అతి ఆత్మవిశ్వాసం వల్ల ఇప్పుడు కమిటీల విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారింది అంటూ చెప్పారు.

జగన్ తొందరపడ్డాడా ? అందుకేనా ఈ

ఇదే విషయం కోర్టు వరకు వెళితే ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు అని ఆయన హెచ్చరించారు.వాస్తవంగా ఏమీ లేని ఏపీ ప్రజలకు ఏదో ఒక ప్రాంతం రాజధానిగా ఉంది కదా అనేది సాధారణ జనాల ఆలోచన.అయితే అమరావతి నిర్మాణం అనేది లక్ష కోట్ల బడ్జెట్.

అది ఇప్పుడు అప్పుడే తేలే వ్యవహారం కాదని కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం అభిప్రాయాన్ని చెపితే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు.ఇప్పుడు అనవసరంగా ప్రతిపక్షలకు ఆయుధం అందించినట్లు అయింది.

అమరావతి రాజధాని నుంచి తరలించాలని జగన్ ముందే అనుకున్నా రాజధాని మార్పుపై కమిటీలు వేశారని, అందుకే ఆయన కోరిక మేరకు ఆయన కోరుకున్న విధంగా ఆ రెండు కమిటీలు నివేదికలు ఇచ్చాయనే విమర్శలు వచ్చి ఉండేది కాదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube