ట్రంప్ కి సలహదారుగా కొనసాగను....ఇవాంక కీలక వ్యాఖ్యలు

ఇవాంక ట్రంప్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమార్తె.ట్రంప్ కి ఇవాంక నే సలహాదారుగా వ్యవహరిస్తున్న విషయం మనకి తెలిసిందే.

 Ivanka Trump Suggests She May Leave White House Job Father Re Elected-TeluguStop.com

ట్రంప్ ముఖ్యమైన విషయాలలో ఈమె సూచనలు, సలహాలు పాటిస్తారు.తండ్రికి రాజకీయ విషయాలలో లో కూడా ఇవాంక ముఖ్యపాత్రనే పోషిచింది.

అలా ట్రంప్ కి అన్ని విషయాలలో తోడు ఉండే ఇవాంక ఇప్పుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఒక కార్యక్రమం లో పాల్గొన్న ఇవాంక మాట్లాడుతూ.

వచ్చే సంవత్సరం జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల బరి లో తన తండ్రి ట్రంప్ ఎన్నికైన సరే, ఇప్పుడు తను వ్యవహరిస్తున్న సలహాదారు పదవిలో కొనసాగటం అనేదే ప్రస్నార్ధకం అని ఇవాంక చెప్పారు.తల్లిగా తన ముగ్గురి పిల్లల అవసరాలు తిర్చటమే తన ప్రధమ బాధ్యత అని, వారి ఆనందమే తనకి ముఖ్యం అని చెప్పారు.

అన్ని సహకరిస్తే తరువాత మిగతా విషయాలు ఆలోచిస్తాను అని తెలిపారు.

Telugu Advisory Role, Donald Drump, Ivanka Trump, White Job-

తాను రాజకీయాలలోకి వచ్చి ఎన్నో సేవలు చేశాను, కానీ ఇంకా చేయవలసినది చాల ఉందని తెలిపిన ఇవాంకా, గత తన రాజకీయసేవ లో భాగంగా క్రిమినల్ జస్టిస్, పిల్లల సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చానని పేర్కొంది.కాగా ప్రపంచ దేశాల మద్య ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగడంలో ఇవాంకా కీలక పాత్ర పోషించేవారు.ఇవాంక మరియు ఆమె భర్త జారెద్ 2017 నుంచి ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ లో పని చేస్తున్న విషయం తెలిసినదే.

ట్రంప్ ఎన్నికల ప్రచారం లో కూడా ఇద్దరు పాల్గొన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube