అమెరికా – భారత్ ల మధ్య గతం నుంచి మంచి సంభంధాలు ఉన్నాయి.ఇరు దేశాలు పరస్పర సహకారంతోనే ముందుకు ఉండేవి.
అయితే మోడీ ప్రధానిగా ఎంట్రీ ఇచ్చిన తరువాత ఇరు దేశాల మధ్య భంధం మరింతగా బలపడిందనే చెప్పాలి.ట్రంప్ హయాంలో ఇరు దేశాల స్నేహ భంధం చూసి కొన్ని దేశాలు కళ్ళు కుట్టుకున్నాయి కూడా.
అయితే ఈ భంధం ఇలా ఉంటే సరిపోదని మరింతగా బలపడాలని ట్రంప్ గారాల పట్టి ఇవాంకా ట్రంప్ పిలుపు ఇచ్చారు.మరి కొద్ది రోజుల్లో తండ్రి శ్వేత సౌధం విడిచి వెళ్లనున్న నేపధ్యంలో ఇవాంకా ఈ తరహా వ్యాఖ్యలు చేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది…ఆ వివరాల్లోకి వెళ్తే.
2017 లో ఇవాంకా ట్రంప్ జీఈ ఎస్ సమావేశంలో పాల్గొనేందుకు భారత్ వచ్చిన సందర్భంగా ప్రధానితో ఉన్న ఫోటోలు కొన్ని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.అప్పటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ అమెరికా భారత్ ల మధ్య మరింత బలమైన స్నేహ భంధం అవసరమని అన్నారు.
యావత్ ప్రపంచం మొత్తం కోవిడ్ తో పోరాడుతోందని ఈ సమయంలో ప్రపంచ భద్రతా, ఆరోగ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని కలిగించడానికి, ప్రజలలో ధైర్యం నింపడానికి ఇరు దేశాల మధ్య గతం కంటే కూడా మరింత బలమైన స్నేహ భంధం ఉండాలని అన్నారు.
భారత్ పర్యటనకు వచ్చిన సమయంలో ఆమె తన భర్త తో పాటు వచ్చారు.భారత్ లో ప్రసిద్ద ప్రాంతాలు చూసిన ఆమె భారత్ ఎంతో గొప్ప దేశం అంటూ కితాబు ఇచ్చారు.అయితే ఈ ఘటన జరిగి దాదాపు మూడేళ్ళు కావస్తోంది ఈ మధ్య కాలంలో ఎప్పుడు ఇవాంకా తన పర్యటన ఫోటో లు షేర్ చేయలేదు కానీ మరి ఇప్పుడు ఎందుకు భారత్ తో స్నేహ భంధం ఉండాలి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిందా అంటూ ఆలోచనలో పడ్డారు.
అయితే ఇవాంకా భవిష్యత్తులో అమెరికా అధ్యక్ష్య అభ్యర్ధిగా పోటీ చేయడానికి ఆశక్తి కనబరుస్తోందని ఈ క్రమంలోనే ఆమె ఈ తరహా వ్యాఖ్యలు చేసి ఉండచ్చని అంటున్నారు పరిశీలకులు.