ఇకపై వారానికి నాలుగు రోజులే ఆఫీస్‌లు... ఇది వర్కౌట్‌ అయ్యేనా?

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో ప్రస్తుతం వారంలో అయిదు రోజులు మాత్రమే వర్క్‌.శని, ఆదివారాల్లో కంపెనీలు బంద్‌ అనే విషయం తెల్సిందే.

 Its Time To Switch To A Four Day Working Week Davos Experts-TeluguStop.com

అందుకే ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలో జాబ్‌ కోరుకుంటూ ఉంటారు.వారంలో అయిదు రోజులు కష్టపడి రెండు రోజులు పూర్తిగా విశ్రాంతి తీసుకోవచ్చు లేదంటే ఎంజాయ్‌ చేయవచ్చు.

ఇలాంటి ఉద్యోగాలు చేయాలని యువత కలలు కంటున్న నేపథ్యంలో వీకెండ్స్‌ను మరింతగా పెంచాలనే చర్చ చాలా ఏళ్లుగా జరుగుతోంది.వర్క్‌ ఒత్తిడితో ఇబ్బంది పడుతున్న ఉద్యోగస్తులను కాస్త రిలాక్స్‌ అయ్యేలా చేసేందుకు రెండు రోజులు కాదు మూడు రోజుల పాటు వీకెండ్స్‌ ఇవ్వాలని అంటున్నారు.

ప్రసుత్తం దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ వాణిజ్య సదస్సులో కూడా ఈ విషయమై ప్రత్యేకంగా చర్చించారు.ఈ సదస్సులో సాఫ్ట్‌వేర్‌ ఇండస్ట్రీ గురించి ప్రధానంగా చర్చ జరిగింది.ఎన్నో వందల కంపెనీలు అక్కడ స్టాల్స్‌ ఏర్పాటు చేశాయి.రాబోయే కాలంలో మారబోతున్న టెక్నాలజీకి సంబంధించిన విషయాలపై చర్చించారు.

అదే సమయంలో ప్రపంచ వాణిజ్య సదస్సులో వీకెండ్స్‌ పై కూడా చర్చ జరిగింది.గత కొంత కాలంగా మూడు రోజుల వీకెండ్స్‌ కావాలంటూ కోరుతున్న ఉద్యోగస్తుల విజ్ఞప్తి కూడా అక్కడ చర్చ జరిగింది.

వర్కింగ్‌ అవర్స్‌ పెంచడం వల్ల మూడు వీకెండ్స్‌ ఇవ్వడం మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు.అంటే ప్రస్తుతం రోజుకు 8 గంటలు వర్క్‌ చేస్తున్న వారు 10 గంటలు వర్క్‌ చేసి అదనపు వీకెండ్‌ తీసుకోవడం మంచిదని ఎక్కువ మంది అభిప్రాయం.అయితే రోజులో 10 గంటల వర్క్‌ అంటే సాధ్యం అయ్యే పని కాదని, వర్క్‌ ఒత్తిడి ఎక్కువ అయ్యి, మొదటికే మోసం వస్తుందనేది కొందరి అభిప్రాయం.మూడు రోజుల వీకెండ్స్‌ నిర్ణయం ఇప్పటికిప్పుడు తీసుకోలేమని కొందరు తేల్చి చెప్పారు.

పరిస్థితి చూస్తుంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగస్తులు వీకెండ్స్‌ మూడు రోజులకు పెరగాలంటే మరి కొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube