'జవాన్' కోసం మహేష్ బెస్ట్ విషెస్.. పోస్ట్ వైరల్!

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్( Shah Rukh Khan ) నటించిన లేటెస్ట్ మోస్ట్ ఏవైటెడ్ మూవీ జవాన్( Jawan ).

ఈ సినిమాపై బాలీవుడ్ లో ఎంత బజ్ క్రియేట్ అయ్యిందో సౌత్ లో కూడా అదే రేంజ్ లో బజ్ క్రియేట్ అయ్యింది.

రేపు ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవ్వనుంది.దీంతో టీమ్ అంతా ప్రమోషన్స్ పై ద్రుష్టి పెట్టారు.

ఈ సినిమా పేరుకు మాత్రమే బాలీవుడ్.ఈ సినిమాలో పని చేసిన వారంతా సౌత్ కు చెందిన వారు కావడం విశేషం.

షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార( Nayanthara ) హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ మూవీ జవాన్ సినిమా సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతుంది.పఠాన్ సినిమాతో 1000 కోట్ల మార్క్ క్రాస్ చేసి సంచలనాలు సృష్టించిన షారుఖ్ ఈ సినిమాతో కూడా అదే రేంజ్ లో వసూళ్లు సాధించాలని చూస్తున్నాడు.మరి ఈ సినిమాపై వస్తున్న పాజిటివ్ బజ్ చూస్తుంటే సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే విధంగానే ఉంది.

Advertisement

మొదటి షో పాజిటివ్ టాక్ వస్తే చాలు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం ఖాయం.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాపై సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసారు.

ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయ్యింది.

ఇట్స్ టైం ఫర్ జవాన్.పవర్ఫుల్ షారుఖ్ ను చూసేందుకు ఎగ్జైట్ గా ఉందంటూ మహేష్( Mahesh ) తెలిపారు.ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాదించాలి అని విష్ చేసారు.

తాను కూడా తన కుటుంబంతో కలిసి జవాన్ సినిమాను చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.ఈ పోస్ట్ వైరల్ అయ్యింది.

పవన్ కళ్యాణ్ మరో యోగి ఆదిత్యనాథ్.. సంచలన వ్యాఖ్యలు చేసిన కృష్ణవంశీ!
చిరంజీవికి నాగబాబు కంటే పవన్ పైనే ప్రేమ ఎక్కువట.. అందుకు కారణాలివే!

ఇదిలా ఉండగా ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు.విజయ్ సేతుపతి, ప్రియమణి, సునీల్ గ్రోవర్, సన్యా మల్హోత్రా వంటి వారు కీ రోల్స్ పోషిస్తున్నారు.

Advertisement

ఇక ఈ సినిమాను రెడ్ చిల్లీస్ ఎంటెర్టైనమెంట్స్ పతాకంపై గౌరీ ఖాన్ నిర్మిస్తుండగా పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ కానుంది.మరి సెప్టెంబర్ 7న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా షారుఖ్ కు ఎలాంటి హిట్ అందిస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు