కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. విజయ్ 66వ సినిమాగా రాబోతున్న ఈ మూవీలో కన్నడ భామ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా తర్వాత విజయ్ మళ్లీ మాస్టర్ కాంబోలో సినిమా చేస్తున్నారని తెలుస్తుంది.
లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో విజయ్ 67వ సినిమా ఉంటుందని కోలీవుడ్ టాక్.
ఆల్రెడీ విజయ్ కు కథ చెప్పడం.
దానికి ఆయన ఓకే చెప్పడం జరిగిందట.మాస్టర్ కాంబోలో మరో సినిమా అనగానే దళపతి ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు.
మాస్టర్ సినిమా విజయ్ ఖాతాలో మరో సెన్సేషనల్ హిట్ గా నిలిచింది.ఆ సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకుంది.
అయితే విజయ్ 65వ సినిమాగా వచ్చిన బీస్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు.వంశీ పైడిపల్లి సినిమా కథ మాత్రం బాగా వచ్చిందని సినిమా నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని ఫిల్మ్ నగర్ టాక్.