ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ లవ్ స్టోరీ..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లవ్ స్టోరీ సినిమాను వాయిదా వేస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి.అయితే వీటిపై క్లారిటీ ఇచ్చారు చిత్రయూనిట్.

 Its Official Naga Chaitanya Love Story Postponed-TeluguStop.com

చిత్ర దర్శకుడు శేఖర్ కమ్ముల, హీరో, నిర్మాతలు కలిసి సినిమా వాయిదా వేస్తున్నట్టుగా ప్రకటించారు.కరోనా సెకండ్ వేవ్ ముదురుతున్న కారణంగానే ఆరోగ్యాన్ని ముందు కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది.

అందుకే సినిమాను వాయిదా వేస్తున్నట్టు చెప్పారు శేఖర్ కమ్ముల.

 Its Official Naga Chaitanya Love Story Postponed-ఇట్స్ అఫీషియల్.. వాయిదా పడ్డ లవ్ స్టోరీ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

నాగ చైతన్య హీరోగా నటించిన ఈ సినిమాలో సాయి పల్లవి ఫీమేల్ లీడ్ నటించింది.

అసలైతే సినిమాను ఏప్రిల్ 16న ఉగాది కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నారు కాని అది కాస్త వాయిదా పడ్డది.సినిమాలోని సారంగ దరియా సాంగ్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యింది.100 మిలియన్ వ్యూస్ తో సోషల్ మీడియాలో సారంగ దరియా సాంగ్ దుమ్ముదులిపేసింది.ఏప్రిల్ 16న సినిమా వస్తుందని అందరు అనుకున్నారు కాని వాయిదా పడ్డది.

లవ్ స్టోరీ కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడన్నది త్వరలో చెబుతామని అన్నారు చిత్రయూనిట్. సినిమాకు ఇప్పటికే యూత్ లో సూపర్ క్రేజ్ ఏర్పడగా మజిలీ, వెంకీమామ హిట్లతో సూపర్ ఫాం లో ఉన్న చైతు లవ్ స్టోరీతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నాడు.

#LoveStory #Naga Chaitanya #Postponed #It'sOfficial #Sai Pallavi

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు