అలారం మోగాక కూడా మీరు ఇంకా పడుకుంటారా.. అయితే ఇది తప్పకుండా మీకోసమే, చదవండి

తెల్లవారు జామున నిద్ర అధికంగా వస్తూ ఉంటుంది.రాత్రి సమయంలో 12 గంటల వరకు కూడా నిద్ర పోకుండా ఉండగలిగే వారు తెల్లవారు జామున లేవమంటే మాత్రం చాలా ఇబ్బంది పడతారు.

 Its Not Good To Have Sleep After Alarm-TeluguStop.com

ప్రతి సారి కూడా తెల్లవారు జామున అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా లేవడం లేదంటే చాలా ఆలస్యంగా లేవడం చేస్తూ ఉంటారు.తెల్లవారు జామున నిద్ర పోవడం మంచిదే కాని, ఒకసారి మేలుకువ వచ్చిన తర్వాత మళ్లీ నిద్ర పోవాలనుకుంటే మాత్రం అది మంచి పద్దతి కాదని నిపుణులు చెబుతున్నారు.

మనం మామూలుగా తెల్లవారు జామున 6 గంటల సమయంలో లేవాలని అలారం పెట్టామని అనుకుందాం, ఆ సమయంకు మనం గాఢమైన నిద్రలో ఉటాం.అలారం మోగిన వెంటనే నిద్ర లేవలేం, కొన్ని సార్లు ఒక అయిదు పది నిమిషాల తర్వాత లేద్దాం లే అనుకుంటాం.

దాంతో అలారంను పది నిమిషాల తర్వాత మోగేలా సెట్‌ చేసుకుంటాం.ఆ తర్వాత మళ్లీ అలారం టైం మార్చుతూ ఆరు నుండి ఏడు గంటల వరకు పడుకుంటాం.

అలా గంట సమయం పాటు నిద్ర పోకుండా, నిద్ర లేవకుండానే ఉంటాం.

ఆ సమయంలో మనం ఒకవేళ నిద్రపోయినా కూడా అది నాణ్యమైన నిద్ర కాదని నిపుణులు అంటున్నారు.

కొద్ది సమయం పడుకుంటే నిద్రలోకి జారే అవకాశం అయితే ఉంటుంది, కాని అది ఉపయోగదాయకమైన నిద్ర కాదని, లేచిన తర్వాత ఆ ప్రభావం రోజంతా ఉంటుందని అంటున్నారు.రోజు అనుకున్న సమయంకు లేవగానే రోజు స్టార్ట్‌ అవుతుంది.

అదే నిద్ర నుండి లేచి మళ్లీ పడుకుని, మళ్లీ లేస్తే మాత్రం అది ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటున్నారు.మానసిక ఒత్తిడి మరియు శారీరకంగా కూడా ఇబ్బంది ఉంటుందని అంటున్నారు.

అలారం మోగిన తర్వాత అయిదు నిమిషాలు బెడ్‌ పైనే ఉన్నా, ఆ తర్వాత లేవడం ఉత్తమంగా చెబుతున్నారు.అందుకే అలారం మోగిన తర్వాత వెంటనే లేవడం ఉత్తమంగా చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube