విడాకులను ఇతడెలా సెలబ్రేట్ చేసుకున్నాడో చూస్తే నవ్వాగదు..!

సాధారణంగా పెళ్లి చేసుకున్న తర్వాత కొందరు హ్యాపీగా ఉంటే, మరికొందరు గొడవలు పడుతూ చాలా అసంతృప్తిగా ఉంటారు.అయితే పెళ్లి చేసుకున్న తర్వాత మళ్లీ విడాకులు తీసుకోవడం ఇష్టం లేక అడ్జస్ట్ అవుతుంటారు.

 Its Not Funny To See How He Celebrated His Divorce , Divorce Celebrate, Celebrat-TeluguStop.com

అలానే పిల్లల్ని కంటారు.వారిని పెద్ద చేస్తారు.

చివరికి తమ భాగస్వామితో ఉండలేమని భావించి విడిపోవడానికి సిద్ధమవుతారు.విడాకులు తీసుకోవడంలో కొందరికి తమ పిల్లల సపోర్ట్ కూడా ఉంటుంది.

అయితే తాజాగా ఒక వ్యక్తి కూడా తన భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు.ఆ తర్వాత తన పిల్లలతో కలిసి విడాకులను సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక వాటర్ స్పోర్ట్స్ దగ్గరికి వెళ్ళాడు.

అనంతరం ఒక ఫ్లాట్ ఫామ్ పైకప్పు పైకి ఎక్కి వాటర్ లోకి దూకాడు.దీనికి సంబంధించిన వీడియోని @pubity అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజీ షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే మిలియన్ లలో వ్యూస్, 7 లక్షలకు పైగా లైకులు వచ్చాయి.

వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి స్విమ్మింగ్ డ్రాయర్ వేసుకుని ఒక నిర్మాణం పైకప్పుపై నిల్చొని ఉండడం చూడవచ్చు.

ఆ తర్వాత అతడు అక్కడి నుంచి దూకేశాడు.అలా ఒక ప్లాట్‌ఫామ్‌పై జారుకుంటూ వచ్చి నీళ్లలో పడి పోయాడు.

అనంతరం ఫుల్‌గా ఎంజాయ్ చేస్తూ నీటిలో ఈత కొట్టాడు.ఈ వీడియోపై “మా డాడీ ఇటీవలే విడాకులు తీసుకున్నాడు.

ఇప్పుడు దాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నాడు” అని రాశారు.

ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.వామ్మో విడాకులు తీసుకున్న తరువాత మగవారు ఇలా కూడా సెలబ్రేట్ చేసుకుంటారా అని కొందరు లేడీస్ కామెంట్ చేస్తున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube