షరతులకు ఇది సమయం కాదమ్మా..!

హీరోయిన్‌ అన్న తర్వాత ఏ పాత్రలో అయినా నటించాలి, ఎలా అయినా నటించాలి.అప్పుడే ఎదగగలరు.

 It’s Not Fair At All-TeluguStop.com

ముఖ్యంగా కెరీర్‌ ఆరంభంలో అన్ని పక్కకు పెట్టి నటించాల్సి ఉటుంది.కాని కొందరు హీరోయిన్స్‌ మాత్రం కట్టుబాట్లు పెట్టుకుని సినిమాలను ఒప్పుకుంటూ ఉంటారు.

అలా పరిధులు పెట్టుకున్న వారు, షరతులు పెట్టే వారు రాణించినట్లుగా ఎప్పుడు లేదు.ఆ తర్వాత అయినా మళ్లీ వారు తమ షరతులను సడలించి నటించడం చూశాం.

తాజాగా రాశి ఖన్నా కూడా సినిమాల్లో నటించేందుకు షరతులు పెడుతోంది.


‘ఊహలు గుసగుసలాడే’ చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ రాశిఖన్నా మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకుంది.

ఆ తర్వాత ఈమెకు సరైన సక్సెస్‌ దక్కలేదు.అయినా కూడా ఆఫర్లు మాత్రం వరుసగా వస్తూనే ఉన్నాయి.

ఈమె అవకాశాల కోసం తన బరువును భారీగా తగ్గించుకుంది.దాదాపు పది కేజీల బరువు తగ్గిన ఈ అమ్మడు ప్రస్తుతం ‘సుప్రీం’ మరియు ‘ఆక్సీజన్‌’ చిత్రాల్లో నటిస్తోంది.

తాజాగా ఈమె నటించిన సుప్రీం చిత్రం ఆడియో విడుదల అయ్యింది.తాజాగా ఈ అమ్మడు మాట్లాడుతూ తాను కథ, దర్శకుడు, హీరో నచ్చితేనే సినిమా చేస్తాను అంటూ షరతులు పెడుతుంది.

ఈ సమయంలో షరతులు పెడితే కెరీర్‌కు దెబ్బ అంటూ రాశిని ఆమె సన్నిహితులు సున్నితంగా హెచ్చరిస్తున్నారు.


.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube