గడ్డుకాలం తప్పదా... 2050కి ఇండియాలో నీళ్లే దొరకవట!

వింటుంటే వెన్నులో వణుకు పుడుతోంది కదూ.అవును, దానికి అవకాశం మెండుగా ఉండి.

 It's Not A Bad Time  Water Will Be Scarce In India By 2050, Scarce Water, Water-TeluguStop.com

నీరు అనేది ఈ సమస్త విశ్వమానవాళికి జీవనాధారం.అవి లేకపోతే ఈ భూమిమీద ఏ ప్రాణి జీవించలేదు.

ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో నీరు దొరక్క ప్రజలు చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.చాలా చోట్ల మురికి నీరునే తాగునీటిగా వాడుతున్నారు.

అంతేకాకుండా నీటి కోసం కిలోమీటర్లు దూరం నడవడం, బావిలో నుంచి అట్ట అడుగున ఉన్న నీటిని తోడుకోవడం లాంటి ఘటనలు ఎన్నో మనం ఈ కళ్ళతో చూశాం, చూస్తున్నాం.

ఇలాంటి తరుణంలో యునెస్కో ( UNESCO )మరింత ఆందోళన కలిగించే విషయాలు బయటపెట్టింది.2050 నాటికి భారతదేశం తీవ్రమైన నీటి కొరతను( Water scarcity ) ఎదుర్కొంటుందని ఓ నివేదికలో వెల్లడిచింది.2016లో దాదాపు 93 కోట్ల మంది నీటి కొరతను ఎదుర్కొనగా అప్పటినుండి చూసుకుంటే ఈ సంఖ్య ప్రతి ఏటా పెరుగుతూ వస్తోంది.అయితే 2050 నాటికి ఈ సంఖ్య 170 కోట్ల నుంచి 240 కోట్ల వరకు చేరుకుంటుంది అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.దీనివల్ల భారత్( India ) తీవ్రంగా నీటి ప్రభావాన్ని చవిచూస్తుందని పేర్కొంది.

నేడు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు 200 కోట్ల మంది నీరు లేక నానా అవస్థలు పడుతున్నారు.దాదాపు ఆసియాలోనే 80 శాతం మంది నీటి కొరతతో ఇబ్బందులకు గురైన పరిస్థితి.ముఖ్యంగా చైనాలోని ఈశాన్య ప్రాంత ప్రజలు, భారత్, పాకిస్థాన్( India , Pakistan ) ప్రజలు ఎక్కువగా నీటి ఇబ్బందులతో అవస్థలు పడుతున్నట్లు తెలిపింది.ప్రస్తుతం 153 దేశాలు దాదాపు 93 నదులు, సరస్సులు, జలాశయ వ్యవస్థలను పంచుకుంటున్నాయి.

అందులో సగానికి పైగా ఒప్పందం చేసుకున్నవే ఉన్నాయని ఆ నివేదిక చిఫ్ ఎడిటర్ రిచార్డ్ కాన్నర్ ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సమస్యను పరిష్కరించకపోతే భవిష్యత్తులో కచ్చితంగా ప్రపంచం నీటి కొరతను ఎదుర్కొంటుందని హెచ్చరించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube