ఇట్స్ బేబీ గర్ల్.. ఆడపిల్లకు జన్మనిచ్చిన హరితేజ..!

అంతకుముందు సీరియల్స్ లో కనిపించినా పెద్దగా రిజిస్టర్ అవని హరి తేజ బిగ్ బాస్ సీజన్ 1లో అదరగొట్టింది.సీజన్ 1 క్రేజీ కంటెస్టంట్స్ లో ఒకరుగా హరితేజ దుమ్ముదులిపేసింది.

 Its Baby Girl For Hariteja Delivered Baby Girl Biggboss Hariteja, Hariteja Ancho-TeluguStop.com

బిగ్ బాస్ లో తన టాలెంట్ చూపించిన హరితేజ హరికథతో చాలా పాపులర్ అయ్యింది.బిగ్ బాస్ తర్వాత బుల్లితెర షోలతో మంచి ఫాంలో ఉంది హరితేజ.

తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పి ఆడియెన్స్ ను సర్ ప్రైజ్ చేసిన హరితేజ.బేబీ బంప్ తోనే కొన్ని షోలకు వచ్చి అలరించింది.

ఫైనల్ గా సోమవారం హరితేజ పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చిందని తెలుస్తుంది.ఈ విషయాన్ని హరితేజ స్వయంగా తన సోషల్ బ్లాగుల్లో ఎనౌన్స్ చేసింది.

ఇట్స్ బేబీ గర్ల్ అని హరితేజ పెట్టిన మెసేజ్ ఆమె ఫ్యాన్స్ ను అలరిస్తుంది.2015లో దీపక్ ను పెళ్లాడిన హరితేజ బుల్లితెర మీద తన హవా కొనసాగిస్తుంది.ఈమధ్య సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలతో ఆకట్టుకుంటుంది.స్మాల్ స్క్రీన్, సిల్వర్ స్క్రీన్ అనే తేడా లేకుండా హరితేజ అక్కడ ఇక్కడ అదరగొడుతుంది.సూపర్ టాలెంట్ ఉన్న హరితేజ ప్రెగ్నెన్సీ నిమిత్తం కొన్నాళ్లు అన్ని షోలకు దూరంగా ఉంది.మళ్లీ కొద్దిపాటి గ్యాప్ తో ఆమె వస్తుంది.

హరితేజ ఎనర్జీ.యాంకరింగ్ మిస్ కొన్నాళ్లు మిస్ అవక తప్పదని ఫీల్ అవుతున్నారు హరితేజ ఫ్యాన్స్.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube