రక్షాబంధన్ స్పెషల్.. రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఉండాల్సిన వస్తువులు!

Items To Keep On The Rakhi Tray

అన్నా – చెల్లెలు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ పండుగను నిర్వహించుకుంటారు.ఈ పండుగ సోదర సోదరీమణులకు ఎంతో ముఖ్యమైన పండుగ అని చెప్పవచ్చు.

 Items To Keep On The Rakhi Tray-TeluguStop.com

తన సోదరుడు జీవితంలో అత్యున్నత స్థానానికి ఎదగాలని, దీర్ఘాయుష్షు డై ఉండాలనే తన సోదరి రాఖీ కట్టగా, అందుకు సోదరీమణులకు విలువైన బహుమతులను కానుకగా ఇస్తుంటారు.ఈ క్రమంలోనే ప్రతి ఏటా శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమిని రాఖీ పౌర్ణమిగా ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా ఎంతో వేడుకగా జరుపుకుంటారు.

ఎంతో పవిత్రమైన ఈ పండుగ రోజు తమ సోదరుడికి రాఖీ కట్టే సమయంలో తప్పకుండా ఈ వస్తువులను ఉంచాలనే పండితులు చెబుతున్నారు.

 Items To Keep On The Rakhi Tray-రక్షాబంధన్ స్పెషల్.. రాఖీ కట్టేటప్పుడు తప్పకుండా ఉండాల్సిన వస్తువులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

రాఖీ పౌర్ణమిరోజు మంచి తిథిలో రాఖీ కట్టడం వల్ల వారి జీవితంలో అంతా శుభం కలుగుతుందని పండితులు చెబుతున్నారు.

ఈ క్రమంలోనే యమగండం, రాహుకాల లో రాఖీలను కట్టకూడదు.రాఖీ ఎల్లప్పుడూ కూడా సంపూర్ణ చందమామ దర్శనం ఇచ్చిన సమయంలో మాత్రమే కట్టాలని పండితులు చెబుతున్నారు.మరి రాఖీ కట్టే సమయంలో ఏ వస్తువులను పెట్టాలి అనే విషయానికి వస్తే.

Telugu Iteams, Items To Keep, Rakhi Pournami, Raksha Bandhan, Raksha Bandhan 2021, Sweets-General-Telugu

రాఖీ కట్టే సమయంలో ట్రేలో తప్పనిసరిగా కుంకుమ, అక్షింతలు, స్వీట్స్, రాఖి తప్పనిసరిగా ఉండాలని పండితులు చెబుతున్నారు.ముందుగా రాఖి కట్టేటప్పుడు రాఖీని బియ్యంలో ఉంచి దానికి పసుపు కుంకుమ పెట్టాలి.ఆ తర్వాత మన సోదరుడికి రాఖీ కట్టే సమయంలో ముందుగా తన నుదుటిపై కుంకుమ పెట్టాలి.

కుంకుమను దీర్ఘాయుష్షు, అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు కనుక ముందుగా కుంకుమ పెట్టి తలపై అక్షతలు వేయాలి.అక్షింతలు అంటే పరాజయం లేనిది అని అర్థం.

అయితే అక్షింతలు చేసేటప్పుడు ఎల్లప్పుడూ కూడా సంపూర్ణంగా ఉండే బియ్యాన్ని చేయాలిగాని విరిగిన బియ్యంతో అక్షింతలు తయారు చేయకూడదు.

Telugu Iteams, Items To Keep, Rakhi Pournami, Raksha Bandhan, Raksha Bandhan 2021, Sweets-General-Telugu

ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టిన రాఖీని తన సోదరుని చేతికి కట్టి ఆ తర్వాత ఏదైనా మిఠాయిలను తన సోదరునికి తినిపించాలి.ఈ విధంగా మిఠాయిలను తినిపించడం వల్ల వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎల్లప్పుడూ ఎంతో తీయగా, ఎలాంటి కలహాలు లేకుండా ఉంటుందని చెప్పవచ్చు.ఈ విధంగా రాఖీ కట్టే సమయంలో తప్పకుండా ఈ వస్తువులు ఉండాలని పండితులు చెబుతున్నారు.

రాఖీ కట్టిన తర్వాత సోదరుడు ఎంతో విలువైన కానుకలను తన సోదరికి బహుమతిగా ఇస్తారు.

#Sweets #Raksha Bandhan #Raksha Bandhan #Iteams #Rakhi Pournami

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube