ఐటమ్ సాంగ్స్ చేసే ఆలోచన లేదు... ఆ సీన్స్ కూడా మనస్ఫూర్తిగా చేయలేదు: కృతి శెట్టి

ఉప్పెన ( Uppena ) సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్న నటి కృతి శెట్టి ( Kriti shetty ) వరుసగా నటించిన మూడు సినిమాల ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్నారు.అనంతరం ఈమె నటించిన మూడు సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి .

 Item Songs Even Those Scenes Were Not Done On Purpose , Kriti Shetty, Samantha,-TeluguStop.com

ఇక తాజాగా ఈమె నాగచైతన్య ( Nagachaitanya ) హీరోగా నటించిన కస్టడీ సినిమా ( Custody Movie ) ద్వారా ప్రేక్షులముందుకు వచ్చింది.ఈ సినిమా కూడా మిత్రమా ఫలితాన్ని అందుకుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కృతి శెట్టికి ఎన్నో రకాల ప్రశ్నలు ఎదురయ్యాయి.ఈ సందర్భంగా యాంకర్ ప్రశ్నిస్తూ మీరు కూడా ఉ అంటావా మావా అనే పాటలో నటిస్తారా అంటూ ప్రశ్నించారు.

Telugu Kriti Shetty, Naga Chaitanya, Samantha, Uppena-Movie

ఈ ప్రశ్నకు కృతి శెట్టి సమాధానం చెబుతూ… ప్రస్తుతానికి అయితే అలాంటి ఐటెం సాంగ్స్ చేసే ఆలోచనలో లేనని తేల్చి చెప్పారు.నాకు ఆ పాటల పై ఎలాంటి అవగాహన లేదు.ఎప్పుడు ఆ పాటల గురించి ఆలోచించను కూడా లేదు.ఇలా నా సినీ ప్రయాణంలో నేను తెలుసుకున్న విషయం ఏదైనా ఉంది అంటే మనకు నచ్చనీ పని చేయకపోవడం మంచిదని తెలిపారు.

ఇక తాను నటించిన సినిమాలలో కూడా రొమాంటిక్ సన్నివేశాలలో తాను మనస్ఫూర్తిగా చేయలేదనీ ఈ సందర్భంగా కృతి శెట్టి సమాధానం చెప్పారు.

Telugu Kriti Shetty, Naga Chaitanya, Samantha, Uppena-Movie

మనకు నచ్చినపుడు అలాంటివి చేయకపోవడమే మంచిదనే విషయాన్ని తాను తెలుసుకున్నానని ఇకపై తన కెరీయర్ లో ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ముందుకు సాగుతానని తెలిపారు.ఇక సమంత నటించిన ఉ అంటావా మావా అనే స్పెషల్ సాంగ్ గురించి కృతి శెట్టి మాట్లాడుతూ సమంత (Samantha) ఒక ఫైర్ అని ఆమె చాలా అద్భుతంగా డ్యాన్స్ చేసిందని ఈ సందర్భంగా కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ పాట ద్వారా సమంత పాన్ ఇండియా స్థాయిలో ఎంతో ఫేమస్ అయిన విషయం మనకు తెలిసిందే

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube