ఒకప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేసింది , ఇప్పుడు ఏకంగా మంత్రి అయింది.. ఆమె ఎవరో చూడండి..     2018-06-10   00:17:35  IST  Bhanu C

వయస్సు అయిపోయిన నటులు ఎంత రాజకీయ ప్రవేశం చేస్తారని ఒక నానుడి ఉంది. ఇందులో సందేహం ఏమి లేదు మన దేశం లో చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కొందరు మంచి నాయకులు గా ఎదిగితే మరికొందరు అట్టర్ ప్లాప్ అయ్యారు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో..అందులోని పాటలు కూడా గొప్ప హిట్ అయ్యాయి. ఈ చిత్రంలో ‘నీ మీద నాకు ఇదయ్యో…’ అంటూ రాక్షసుడు మూవీలో చిరంజీవితో కలిసి స్టెప్పేసిన ఆ అందాలనటి గుర్తుందా..? ఆమె పేరే జయమాల. ప్రస్తుతం ఆమె కర్ణాటక రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధం అయింది.

కర్ణాటక మంత్రి గా

కొత్తగా కొలువైన కుమార స్వామి మంత్రి వర్గంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాదు కన్నడ కేబినేట్‌ ఏకైక మహిళా మినిష్టర్‌గా చరిత్ర సృష్టించారు. 62 ఏళ్ల జయమాల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ.. ఆ పార్టీ తరుపున విధానపరిషత్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. అనంతరం తాజా మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.