ఒకప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేసింది , ఇప్పుడు ఏకంగా మంత్రి అయింది.. ఆమె ఎవరో చూడండి..  

Item Girl In Chiranjeevis Movie Now Cabinet Minister In Karnatakastate -

వయస్సు అయిపోయిన నటులు ఎంత రాజకీయ ప్రవేశం చేస్తారని ఒక నానుడి ఉంది.ఇందులో సందేహం ఏమి లేదు మన దేశం లో చాలా మంది సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చారు, కొందరు మంచి నాయకులు గా ఎదిగితే మరికొందరు అట్టర్ ప్లాప్ అయ్యారు.

ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు’ చిత్రం ఎంత హిట్ అయ్యిందో.అందులోని పాటలు కూడా గొప్ప హిట్ అయ్యాయి.

ఒకప్పుడు చిరుతో కలిసి స్టెప్పులేసింది , ఇప్పుడు ఏకంగా మంత్రి అయింది.. ఆమె ఎవరో చూడండి..-General-Telugu-Telugu Tollywood Photo Image

ఈ చిత్రంలో ‘నీ మీద నాకు ఇదయ్యో…’ అంటూ రాక్షసుడు మూవీలో చిరంజీవితో కలిసి స్టెప్పేసిన ఆ అందాలనటి గుర్తుందా.? ఆమె పేరే జయమాల.ప్రస్తుతం ఆమె కర్ణాటక రాజకీయాలలో తనదైన ముద్ర వేయడానికి సిద్ధం అయింది.

కర్ణాటక మంత్రి గా

కొత్తగా కొలువైన కుమార స్వామి మంత్రి వర్గంలో ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్‌మెంట్‌ మంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేశారు.అంతేకాదు కన్నడ కేబినేట్‌ ఏకైక మహిళా మినిష్టర్‌గా చరిత్ర సృష్టించారు.62 ఏళ్ల జయమాల కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం యాక్టివ్ మెంబర్‌గా ఉంటూ.ఆ పార్టీ తరుపున విధానపరిషత్‌ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.అనంతరం తాజా మంత్రి వర్గంలో చోటు సంపాదించారు.

సినీ జీవితం

రాజకీయాల్లోకి రాకముందు జయమాలి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు.కన్నడలో స్టార్ హీరోలు రాజ్ కుమార్, అనంత్ నాగ్, విష్ణువర్ధన్, శంకర్ నాగ్, అంబరీష్‌లతో కలిసి నటించింది.శకర్ గురు, గిరి కన్య లాంటి సూపర్ హిట్స్ మూవీలో నటించి మెప్పించారు.1974 నుండి 2018 వరకూ పలు కన్నడ, తమిళ, తెలుగు చిత్రాల్లో నటించింది.అనంతరం తెలుగులో రాక్షసుడు మూవీలో ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించారు.ఈ చిత్రంలో చిరంజీవితో కలిసి ‘నీ మీద నాకు ఇదయ్యో…’స్టెప్పులేశారు.ఈ సాంగ్ ఇప్పటికే ఎంతో ప్రాచుర్యంలో ఉంది.

.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు