ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్న ITC Company.. దానికోసం 60 మంది అంధులను తీసుకుంది!

ప్రముఖ కార్పొరేట్ కంపెనీ ITC గొప్ప నిర్ణయం తీసుకుని అంధుల జీవితాల్లో వెలుగు వెన్నెలలు నింపుతోంది.తన కంపెనీలో సబ్బులు, సిగరెట్లు, మంగళదీప్ అగర్బత్తి వంటి ప్రొడక్ట్స్‌కు సంబంధించి ప్రత్యేకమైన సువాసనలను అంచనా వేయడానికి ఇలాంటి దృష్టిలోపం ఉన్న వారిని ITC ప్రస్తుతం జాయిన్ చేసుకుంటోంది.

 ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్-TeluguStop.com

ఇప్పటి వరకు ఈ సంస్థ తన ‘మంగళదీప్ సిక్స్త్ సెన్స్’ ప్యానెల్ భాగంగా 60 మంది దృష్టిలోపం ఉన్న వారిని నియమించుకోవడం విశేషమే.దాంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ITC కంపెనీ వార్తలు చెలరేగాయి.

దృష్టిలోపం ఉన్నవారికి కంటి చూపు పూర్తిగా ఉండదు.కానీ వాసన పసిగట్టడంలో వీరు సాధారణ వ్యక్తుల కంటే మంచి దిట్ట.ట్రైనింగ్ ఇస్తే ఈ రంగంలో వారు సత్తా చాటగలరని నమ్మిన సదరు కంపెనీ ఈ ఐడియా అమలు చేసింది.అయినా కూడా ఈ రంగంలో సాధారణ వ్యక్తులతో పోల్చుకుంటే పాక్షిక దృష్టిలోపం ఉన్న వ్యక్తులు, అంధులలో నియామక రేటు చాలా తక్కువగా ఉంది.

ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ కంపెనీ సదరు నిర్ణయం తీసుకుందని సమాచారం.

Telugu Blind, Hired Blind, Itc Company, Itc Jobs, Sense Smell-Latest News - Telu

ఈ నేపథ్యంలో ఈ కంపెనీ కోల్‌కతా హెడ్‌క్వార్టర్స్ ITC ద్వారా 60 మందిని ఉద్యోగాల్లో చేర్చుకుంది.అంతకుముందు వీరందరూ కోల్‌కతా రోడ్లపైన చిన్న చిన్న వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగించేవారు.ఇప్పుడు ఒక ITC కంపెనీలో చేరి తమ జీవితాలను మార్చుకోబోతున్నారు.

భవిష్యత్తులో ఈ ప్యానెల్‌ ద్వారా కంపెనీ తన వ్యక్తిగత సంరక్షణ, ఆహారం వంటి ఇతర రంగాల్లో కూడా పుట్టుకతోనే కంటిచూపు సమస్యలతో బాధపడుతున్న వారిని మరింతమందిని ఎంపిక చేసుకోనుంది.కాబట్టి మీకు తెలిసిన ఇలాంటి ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే దయచేసి ఈ మెసేజ్ ఫార్వార్డ్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube