ఏకంగా దేశ ప్రధానిపైనే 900 కోట్ల దావా వేసిన ప్రజలు

ఇండియాలో ఎలాంటి పదవి లేని రాజకీయ నాయకుడు మీద ప్రజలు కేసు పెట్టె ప్రయత్నం చేయలేరు.కేసు పెడితే ఆ రాజకీయ నాయకుడు తన బలంగా ఎక్కడ తమని మానసికంగా వేధింపులకి గురి చేస్తాడో అని భయపడతారు.

 Italy People File Case On Prime Minister, Corona Virus, Corona Effect, Covid-19,-TeluguStop.com

ఇక ఎమ్మెల్యే, ఎంపీల మీద అయితే సరేసరి.వాళ్ళు ఎన్ని తప్పులు చేసిన అంగబలం ఉన్న నాయకులని చట్టపరిధిలో ఎదుర్కోవడానికి ప్రజలు ఎప్పుడూ ముందడుగు వేయలేరు.

అలా ఎవరైనా సామాన్యులు రాజకీయ నాయకులపై కేసులు వేస్తే వారికి ఉనికి ఉండదు.ఇప్పుడు విదేశాలలో మాత్రం ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడానికి ప్రజలు ఏ మాత్రం వెనుకంజ వేయరు.

ఒక్కోసారి ఈ ప్రజా తిరుగుబాటు కారణంగా ప్రభుత్వాలు సైతం కూలిపోతాయి.ఇప్పుడు అలాంటి ఓ విచిత్ర పరిస్థితి ఇటలీ ప్రధాని ఎదుర్కోవాల్సి వచ్చింది.

ప్రపంచంలో అత్యంత చిన్న దేశాలలో ఒకటైన ఇటలీని కరోనా దారుణంగా భయపెట్టింది.అక్కడ వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

లక్షల సంఖ్యలో కరోనా బారిన పడ్డారు.కరోనా ఎదుర్కోలేక దేశ ప్రధాని సైతం కన్నీళ్లు పెట్టుకున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందొ అర్ధం చేసుకోవచ్చు.

Telugu Corona Effect, Corona Wave, Corona, Covid, Italy, Prime-Movie

కరోనా సంక్షోభాన్ని ఎదురుకొన్న ఇటలీ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.అయినవాళ్లుని పోగొట్టుకొని, ఉపాధి మార్గాలు కోల్పోయి ఆర్ధికంగా, మానసికంగా కరోనా కారణంగా చావు దెబ్బ తిన్నారు.ఈ నేపధ్యంలో తాజాగా ఇటలీలోని 500 మంది ప్రజలు కలిసి తాజాగా ఇటలీ ప్రధాని గిస్సెపీ కాంటేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.ప్రధానితో పాటు ఆరోగ్యశాఖ మంత్రి, లొంబార్డీ ప్రాంత గవర్నర్ ల పేర్లు కూడా చేర్చుతూ కోర్టులో దావా వేశారు.రూ.900 కోట్ల పరిహారం చెల్లించాలంటూ తమ దావాలో కోరారు.కరోనా కారణంగా లొంబార్డి ప్రాంతం ఎక్కువగా నష్టపోయింది.మరణాల సంఖ్య కూడా అక్కడే ఎక్కువ.తమ ప్రాంతంలో కరోనా ఈ స్థాయిలోప్రజల ప్రాణాలు తీయడానికి ప్రధాని అసమర్థతే కారణం అని అక్కడి ప్రజలు ఇలా కోర్టులో దావా వేశారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube