కరోనాకి భయపడి నిర్భంధంలోకి వెళ్ళిపోయిన ఆ దేశం

ప్రపంచ దేశాలని ఇప్పుడు భయపెడుతున్న అత్యంత ప్రమాదకర వైరస్ కరోనా.ఇప్పటికే చైనాలో విస్తరించిన ఈ వైరస్ ప్రభావంతో ఆ దేశంలోనే వేల సంఖ్యలో ప్రజలు చనిపోయారు.

 Italy Extended Emergency Measures Due To Corona Effect-TeluguStop.com

ఈ బాధితుల సంఖ్య అక్కడ లక్షలు చేరువ అవుతుంది.పక్కనే ఉన్న హాంకాంగ్, ఇరాన్, ఇరాక్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియా, అమెరికా దేశాలు కూడా ఈ కరోనా ప్రభావితంతో వణికిపోతున్నారు.

చైనా తర్వాత ప్రస్తుతం అత్యంత ప్రభావం పడిన దేశాలు ఇటలీ ఇరాన్ లు ముందు వరుసలో ఉన్నాయి.ఆయా దేశాలలో ఈ కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తుంది.

ఈ నేపధ్యంలో ఇటలీ ప్రభుత్వం ఒక అడుగు ముందుకేసి దేశ ప్రజలను నిర్భంధంలో వెళ్లాలని సూచించింది.కరోనా తగ్గే వరకూ ఎవరూ బయటకు రావద్దని సూచనలు చేసింది.

ఇక వేళ ఇటలీలో ఎవరైనా నిబంధనలు అతిక్రమించి బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.అవసరమైతే తప్ప ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలియజేసింది.ప్రభుత్వం ఆదేశాలతో దేశ ప్రజలు కూడా స్వచ్ఛందంగా గృహ నిర్బంధంలోకి వెళ్ళిపోయారు.ఇటలీలో ఇప్పటికే 9712 కరోనా కేసులు నమోదు కాగా మృతుల సంఖ్య 463కు పెరిగింది.

మనుషులలోకి ప్రవేశించిన తర్వాత ఈ కరోనా వైరస్ మరింతగా విస్తరిస్తుందని వైద్యులు చెబుతున్న నేపధ్యంలో ఇటలీ ఈ నిర్భంధం ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube