రాధే శ్యామ్ సినిమాలో అదే హైలెట్.. ఏమిటంటే?

పాన్ ఇండియా హీరో ప్రభాస్ సినిమా అంటే ప్రేక్షకులలో ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బాహుబలి ద్వారా రికార్డులు సృష్టించిన ప్రభాస్ ఆ తర్వాత నటించబోయే సినిమాల అన్నింటిపై కూడా ప్రేక్షకులు అంతకు రెట్టింపు అంచనాలు పెట్టుకొని ప్రభాస్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు.

 Italy Backdrop Scenes Are Highlight In Prabhas Radhe Shyam Movie,  Radhe Shyam,-TeluguStop.com

ఈ క్రమంలోనే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్నటువంటి రాధేశ్యామ్ చిత్రంపై కూడా ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.కథ నచ్చితే కథలో క్వాలిటీ ఉంటే ఎన్ని కోట్లు పెట్టయినా సినిమాలు తెరకెక్కించడానికి యు.వి.క్రియేషన్స్ ఎప్పుడు ముందు వరుసలోనే ఉంటుంది.

ఈ క్రమంలోనే రాధేశ్యామ్ చిత్ర నిర్మాణం కోసం కొన్ని వందల కోట్లను ఖర్చు చేశారు.ఇట‌లీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్రేమ‌క‌థ ఇది.ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ కోసం చిత్రబృందం ఇటలీ వెళ్లాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల వెళ్ళలేక పోయారు.

ఈ సందర్భంగా అచ్చం ఇటలీని తలపించేలా కొన్ని కోట్లు ఖర్చు చేసి హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో భారీ సెట్ వేశారు.ఈ సెట్ లోనే ఎక్కువ మొత్తం సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు రాధాకృష్ణ.

Telugu Radha Krishna, Italy, Italybackdrop, Itlayset, Pooja Hegde, Prabhas, Radh

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ లో కూడా ఈ సెట్ ను ఎంతో అద్భుతంగా చూపించారు.ఇక్కడ తెరకెక్కించిన సన్నివేశాలు సినిమాకి హైలెట్ అవుతాయని దర్శకుడు వెల్లడించారు.గతంలో ప్రభాస్ నటించినటువంటి సాహో వంటి యాక్షన్ చిత్రానికి కొన్ని కోట్లు ఖర్చు చేసినా యువి క్రియేషన్స్ ఇప్పుడు ప్రేమకథా చిత్రానికి అదే స్థాయిలో ఖర్చు చేయడంతో ఈ సినిమా ఏ స్థాయిలో, ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube