పార్లమెంట్ లో ప్రియురాలికి ప్రపోజ్ చేసిన ఎంపీ  

Italian Mp Proposes To Girlfriend During Debate In Parliament-italian Mp Proposes To Girlfriend,italy

పరిచయం లేని ఇద్దరిని దగ్గర చేసి ఒకరికి ఒకరు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ అనేంతగా దగ్గర చేసే బంధం ప్రేమ.ప్రాచీన కాలం నుంచి కవులు, ఎంతో మంది మేధావులు ప్రేమ గురించి చాలా గొప్పగా చెప్పారు.

Italian Mp Proposes To Girlfriend During Debate In Parliament-italian Mp Proposes To Girlfriend,italy Telugu Viral News Italian Mp Proposes To Girlfriend During Debate In Parliament-italian Italy-Italian MP Proposes To Girlfriend During Debate In Parliament-Italian Mp Italy

ప్రేమ గొప్పతనం చెప్పే కథలు కూడా చాలా ఉన్నాయి.ఇక అలాంటి ప్రేమ కథలో ప్రియురాలికి తన ప్రేమ విషయాన్ని చెప్పడానికి ప్రియుడు రకరకాలుగా ప్రయత్నం చేస్తాడు.

ఈ మధ్య కాలంలో ప్రేమని వ్యక్తం చేయడానికి కాస్తా క్రియేటివ్ గా కూడా ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ ఇటాలీకి చెందిన ఓ ఎంపీ లవ్ ప్రపోజ్ చేసేందుకు పార్లమెంట్ నే వేదిక చేసుకున్నారు.

ఎంపీ ఫ్లావో డి మురో పార్లమెంట్‌లో ప్రసంగిస్తున్నారు.సభలో ఉన్న గ్యాలరీలో ఫ్లావో స్నేహితురాలు ఎలీసా కూర్చొని ఆయన ప్రసంగాన్ని ఆసక్తిగా వింటుంది.

అదే టైంలో ప్రసంగం మధ్యలో ఎంపీ ఫ్లావో తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని ఎలీసా వైపు చూపించి ఆమెకి లవ్ ప్రపోజ్ చేశారు.సరికొత్తగా ఆలోచించి పార్లమెంట్‌లోనే తన ప్రేయసిని ప్రపోజ్ చేసిన ఎంపీ ఫ్లావోపై పార్లమెంట్ లో ఇతర సభ్యులు అభినందించారు.

ఎంపీ ఫ్లావో, ఎలీసా ప్రేమ సన్నివేశంతో సభలో కాసేపు సందడి వాతావరణం నెలకొంది.దీనికి సంబందించిన వీడియో ఇప్పుడు సోషల్ లోకి రావడంతో అది విపరీతంగా వైరల్ అవుతుంది.

ఎంపీ క్రియేటివిటీకి ఆసక్తికర కామెంట్స్ నెటిజన్లు పోస్ట్ చేస్తున్నారు.

తాజా వార్తలు

Italian MP Proposes To Girlfriend During Debate In Parliament Related....