కోడి కూసిందని యజమానికి రూ.15 వేలు ఫైన్.. కారణం అదే!

ఏంటి నిజామా? కోడి కూస్తే జరిమానా ఏంటి? సాధారణంగా అయితే ఎప్పుడు కోడి కూస్తే అప్పుడు తెల్లరింది అని మన పెద్దలు అంటుంటారు.ఒక కోడి ఉంటే అలారం కూడా అవసరం లేదు అలాంటి కోడి కుసినందుకు 15 వేల రూపాయిలు జరిమానానా? ఇదెక్కడి గోలరా బాబు అని అనుకుంటున్నారా?

 Italian Man,  Fined Rs.15000, Rooster Crows, Early Morning-TeluguStop.com

అక్కడికే వస్తున్న.ఇటలీలోని లంబార్డీ‌లోని కాస్టిరగా విదార్దో పట్టణంలో నివసిస్తున్న ఓ 80 ఏళ్ళ వృద్ధుడు ఓ కోడి పుంజును పెంచుకుంటున్నాడు.అది ప్రతి రోజు తెల్లవారుజాము 4.30 గంటలకు కొక్కొరోకో అంటూ కూస్తోంది.అయితే అలా కుయ్యడం పక్కింటి వారికి పెద్ద తలనొప్పిగా మారింది.

ఉదయాన్నే దాని గోల అతను భరించలేకపోయేవాడు.దీంతో అతను కోడి ఓనర్ కు చాలా సార్లు చాల విధాలుగా హెచ్చరించాడు.కానీ ఆ కోడి ఆగలేదు.దీంతో ఆ కోడి కారణంగా ఇరుగుపొరుగు వారి నిద్రకు భంగం కలుగుతుందని ఆ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో పోలీసులు అతని ఇంటిపై నిఘా పెట్టారు.ఆ కోడి సరిగ్గా 4.30 గంటలకు అరిచింది.అప్పుడు ప్రారంభించిన ఆ కోడి ఉదయం 6 గంటల వరకు అది అలా అరుస్తూనే ఉంది.

దీంతో పోలీసులు అతడికి 200 డాలర్లు అంటే ఇండియన్ కరెన్సీ లో 15 వేల రూపాయిలు జరిమానా విధించారు.దీంతో ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube