హుజురాబాద్ గడ్డపై గెలిచేది ఈటల రాజేందరే..బండి సంజయ్....

Itala Rajendra Is The Winner On Huzurabad Soil Bandi Sanjay

హుజురాబాద్ ఉపఎన్నికలో టిఆర్ఎస్ పార్టీకి డిపాజిట్ గల్లంతే అని,హుజురాబాద్ గడ్డపై కమలం పువ్వు గుర్తుకు తప్ప ఏ గుర్తుకు స్థానం లేదని ఈ ఉపఎన్నికలో గెలిచేది ఈటల రాజేందర్ అని ధీమా వ్యక్తం చేశారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కరీంనగర్ పార్లిమెంట్ సభ్యులు బండి సంజయ్.

 Itala Rajendra Is The Winner On Huzurabad Soil Bandi Sanjay-TeluguStop.com

హన్మకొండ జిల్లా కమలపూర్ మండలం శనిగరం,కమలపూర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల సంక్షేమం కోసం ఎప్పుడు ఆలోచించడు అని, దళితులకు మూడెకరాల భూమి ఏమైంది అని ప్రశ్నించినందుకె ఈటలను మంత్రి పదవి నుంచి తొలగించిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు.

రైతులు ఏ పంట పండించిన అది కొనుగోలు చేసే బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంటుందని అన్నారు.కేసీఆర్ కులాలను,కుల వృత్తులను మోసం చేస్తున్నాడని అన్నారు.

 Itala Rajendra Is The Winner On Huzurabad Soil Bandi Sanjay-హుజురాబాద్ గడ్డపై గెలిచేది ఈటల రాజేందరే..బండి సంజయ్….-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఉద్యోగాలు ఇవ్వాలని మేము పోరాడితే ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతున్నాడు కేసీఆర్ అని ఆరోపించారు.దేశంలో కేసీఆర్ కన్న పెద్ద అవినీతి పరుడు ఎవరు లేరని అన్నారు.

హుజురాబాద్ గడ్డపై కమలం పువ్వు గుర్తుకు తప్ప ఏ గుర్తుకు స్థానం లేదని ఈ ఉపఎన్నికలో ఈటల భారీ మెజారిటీతో గెలవడం కాయం అని ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్

.

#Sanjay #Harish Rao #Bjp #Bandi Sanjya #Etala Rajender

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube