నా పెళ్ళికి నన్ను పిలిచి ఉంటే బాగుండేది: శ్రీముఖి కామెంట్

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకున్న గ్లామర్ బ్యూటీ శ్రీముఖి గురించి టాలీవుడ్ ప్రేక్షకులందరికి తెలిసిందే.తన మాటలతో, అల్లర్లతో ఎంతో మంది బుల్లితెర ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది.

 It Would Be Very Nice If He Had Invited Me To My Wedding By Srimukhi Comment , S-TeluguStop.com

ఎన్నో షోలలో యాంకరింగ్ చేసి తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించి అక్కడ కూడా మంచి సక్సెస్ అందుకుంది.

శ్రీముఖి ఎంత బిజీ లైఫ్లో ఉన్న కూడా సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక ఈమె తొలిసారిగా అదుర్స్ షోతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది.

ఇందులో మంచి పేరు సంపాదించుకోవడంతో ఆ తర్వాత పటాస్ షోలో యాంకరింగ్ చేసి బాగా ఆకట్టుకుంది.అలా ఆ తర్వాత ఎన్నో షోలలో యాంకరింగ్ చేసింది.శ్రీముఖి యాక్టివిటీతో ఎనర్జిటిక్ యాంకర్ అని పేరు కూడా సంపాదించుకుంది.ఏ షోలో నైనా ఆమె చేసే అల్లరి మాత్రం అంతా ఇంతా కాదనే చెప్పాలి.

Telugu Adurs Show, Anchor, Hot, Marrige, Patas Show, Realityshow, Srimukhi, Toll

ఇక బుల్లితెరపై ప్రసారమైన రియాలిటీ షో బిగ్ బాస్ లో అవకాశం అందుకొని మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంది.చివరి వరకు ఆటలో కొనసాగి రన్నరప్ గా నిలిచింది.ఇక బిగ్ బాస్ తర్వాత వెండితెరపై కూడా పలు సినిమాలలో నటించింది.తన యాంకరింగ్ జీవితాన్ని కూడా యధావిధిగా కొనసాగిస్తుంది.ఇక రోజు రోజుకి శ్రీముఖి డిమాండ్ బాగా పెరిగిపోతుందనే చెప్పాలి.

ఇక సోషల్ మీడియాలో మాత్రం శ్రీముఖి చేసే రచ్చ అంతా ఇంతా కాదు.

ప్రతిసారి తన హాట్ ఫోటోలను, ఫన్నీ వీడియోలను షేర్ చేస్తూ బాగా సందడి చేస్తుంది.అంతేకాకుండా పొట్టి పొట్టి డ్రెస్సులు ధరించి డాన్స్ లు చేస్తుంది.ఇక తన డాన్స్ వీడియో లను షేర్ చేస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తుంది.అప్పుడప్పుడు ఫన్నీ ఎక్స్ ప్రెషన్స్ తో తన ఫాలోవర్స్ ను తెగ ఆకట్టుకుంటుంది.

Telugu Adurs Show, Anchor, Hot, Marrige, Patas Show, Realityshow, Srimukhi, Toll

తన ఫాలోవర్స్ ముచ్చట్లు కూడా పెడుతూ ఉంటుంది.వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానాలు చెబుతుంది.ఇక ఫోటో షూట్ లంటూ తెగ హడావుడి చేస్తుంది.అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ తో కలిసి బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.తాజాగా శ్రీముఖి మరో ఆఫర్ సొంతం చేసుకుంది.త్వరలోనే ఈటీవీలో జాతి రత్నాలు అనే కామెడీ ఎంటర్టైన్మెంట్ షోతో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇక ఈ షో కు సంబంధించిన ప్రోమో కూడా ఇటీవలే విడుదలైంది.

ఇదంతా పక్కన పెడితే తాజాగా తన ఫాలోవర్స్ తో కాసేపు ముచ్చట్లు పెట్టింది.

అందులో ఫాలోవర్స్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చింది.ఇక ఓ నెటిజెన్.

శ్రీ పాప.నీ పెళ్లి అని నీకు తెలియకుండా.యూట్యూబ్ లో నీ పెళ్లి అని. పెళ్లి లుక్ అని రచ్చ చేస్తున్నారు అని అనడంతో.వెంటనే శ్రీముఖి చూస్తున్న.అన్నీ పరిశీలిస్తున్న అంటూ.నా పెళ్ళికి నన్ను పిలిచి ఉంటే బాగుండేది కదా అని సరదాగా కామెంట్ చేసింది.ప్రస్తుతం ఈ కామెంట్ వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube