ఈ చేప వయసేంతో తెలిస్తే షాక్ అవుతారు..

సాధారణంగా ఒక చేప ఎన్నేళ్లు బతుకుతుంది? మనకు తెలిసినంత వరకూ ఐదారు సంవత్సరాల పాటు చేపలు బతకగలవు.కొన్ని జాతుల చేపలు 30 ఏళ్ల నుంచి 70 ఏళ్ల వరకు కూడా జీవిస్తాయి.

 It Would Be A Shock To Know The Age Of This Fish, Fish Age, 70 Years, Viral Lat-TeluguStop.com

అయితే అవన్నీ కూడా డీప్ సీ లేదా సముద్ర గర్భంలో మాత్రమే కనిపిస్తాయి.ఇక అక్వేరియంలో నివసించే చేపలు కొన్ని సంవత్సరాలు మాత్రమే మనుగడ సాగించగలవు.

కానీ ఒక చేప మాత్రం ఏకంగా 90 ఏళ్ల పాటు జీవిస్తూ అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.దీని బరువు సుమారు 19 కిలోలట.

దీని పొడవు నాలుగు అడుగులు.ఈ అరుదైన చేప తన భారీ కాయంతో అత్యధిక వయసుతో పర్యాటకులని ఆకర్షిస్తోంది.ఇంతకీ ఇది ఎక్కడుంది? ఇది ఏ జాతి చేప? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

1938 సంవత్సరంలో ఆస్ట్రేలియా దేశం నుంచి అమెరికాలోని శాన్‌ ఫ్రాన్సిస్కోలో ఉన్న ఒక అక్వేరియంకి ఓ ఆస్ట్రేలియన్‌ లంగ్‌ఫిష్‌ను అధికారులు తీసుకొచ్చారు.అప్పటికే దీని వయసు ఆరేళ్లట.అయితే దీన్ని పట్టుకుని తీసుకొచ్చిన అక్వేరియం అధికారులు అందరూ మరణించారు కానీ ఇది మాత్రం ఇప్పటికీ సజీవంగానే ఉంది.9 దశాబ్దాలకు పైగా జీవిస్తున్న దీనికి మెతుసెలా అనే పేరు పెట్టారు.మెతుసెలా అంటే బైబిల్‌లో 969 సంవత్సరాలు బ్రతికిన ఒక వ్యక్తి పేరు.

అతన్నుంచి ఈ చేపకి నామకరణం చేశారు.అయితే సాధారణంగా ఒక చేప ఆడదా? మగదా? అనే విషయం తెలుసుకోవాలంటే లింగ నిర్ధారణ పరీక్ష చేయడం తప్పనిసరి.అయితే మెతుసెలా చేపకు మాత్రం ఇప్పటివరకు లింగనిర్ధారణ పరీక్షలు చేయలేదు.ఇది ఒక ఆడ చేప అయి ఉండొచ్చని శాస్త్రవేత్తలు, సంరక్షకులు భావిస్తున్నారు.ప్రస్తుతానికైతే దీని మొప్పలను పరీక్షించి లింగంతో పాటు దాని వయసును కచ్చితంగా అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు రెడీ అవుతున్నారు.

Telugu Fish Age, Longfish, San Francisco-Latest News - Telugu

ప్రస్తుతం అక్వేరియంలో ఎక్కువకాలం జీవించిన చేపల్లో ఈ ఆస్ట్రేలియన్ లంగ్ ఫిష్ తొలి స్థానంలో నిలుస్తోంది.ఇది తాజా అంజీర పండ్లను ఇష్టంగా తింటుందట.ఎక్కువగా అల్లరి చేయదని.

చాలా ప్రశాంతంగా తన పని తను చేసుకుంటోందని అక్వేరియం నిర్వాహకులు చెబుతున్నారు.ఒక చేదు నిజమేమిటంటే, ఈ లంగ్ ఫిష్ జాతి చేపలు అంతరించిపోతున్న జీవుల జాబితాలో ఉన్నాయి.

అందుకే మెతుసెలా చనిపోతే మళ్లీ మరొకటి తీసుకురావడం దాదాపు అసాధ్యమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube