టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా సక్సెస్ అందుకున్నటువంటి వారిలో యంగ్ బ్యూటీ శ్రీ లీల ( Sreeleela ) ఒకరు.ప్రస్తుతం ఈమె ఇండస్ట్రీలో యంగ్ హీరోస్ నుంచి మొదలుకొని సీనియర్ హీరోల వరకు ఫస్ట్ ఆప్షన్ గా మారిపోయారు.
ఈ క్రమంలోనే శ్రీ లీల ప్రస్తుతం అరడజనుకు పైగా సినిమా అవకాశాలను చేతిలో పెట్టుకొని వరుస సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉంటున్నారు.ఇలా వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు.తనకు ఇండస్ట్రీలో కథ ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే చాలని తెలియచేశారు.అలాంటి పాత్రలు వస్తే తప్పకుండా ఆ అవకాశాలను వదులుకోనని శ్రీ లీల తెలియజేశారు.తనకు ఎక్కువగా షూటింగ్ లొకేషన్లో ఉండటమే ఇష్టమని ఈ సందర్భంగా ఈమె తెలియజేశారు.
ఒకరోజు షూటింగ్ లేకపోతే తనకు ఇంట్లో చాలా బోర్ కొడుతుందని కెమెరా ముందు ఉండడం తనకు ఇష్టంగా మారిందని నిజం చెప్పాలంటే అదొక వ్యసనంగా ( Habbit ) మారిపోయిందని ఈ సందర్భంగా శ్రీ లీల సినిమాలపై తనకు ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు.

ఇలా సినిమాలంటే ఎంతో ఇష్టం ఏర్పడటంతో తనకు ఎక్కువగా షూటింగ్ లొకేషన్స్ లో ఉండడానికే ఇష్టపడతానని శ్రీలీల తెలియజేశారు. ధమాకా ( Dhamaka ) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈమె ప్రస్తుతం హీరో రామ్, బాలకృష్ణ, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా గడుపుతున్నారు.ఇలా వరుస సినిమాలతో శ్రీ లీల క్షణం పాటు తీరిక లేకుండా వరుస సినిమా షూటింగులతో బిజీగా గడుపుతున్నారని చెప్పాలి.
ఇప్పటివరకు ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తదుపరి సినిమాల ద్వారా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది.
