ప్రభాస్ ఓకే అన్నా ఆయనతో సినిమా చేయాలంటే 6 ఏళ్ళు ఆగాల్సిందే !

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ పేరు ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు ప్రపంచవ్యాప్తంగా మారు మోగిపోతుంది.బాహుబలి సినిమాకి ముందు ప్రభాస్ వేరు బాహుబలి తర్వాత వేరు అన్నట్టుగా ప్రభాస్ రేంజ్ మారిపోయింది.

 It Took 6 Years To Make A Film With Pan India Star Prabhas, Prabhas, Tollywood,-TeluguStop.com

ఈ సినిమా తో ఒక్కసారిగా అందరి చూపు ఆయన వైపు తిప్పుకున్నాడు.బాహుబలి సినిమా దాదాపు 5 సంవత్సరాలు పట్టింది.

ఆ తర్వాత సహా సినిమా విడుదల చేసాడు.ఈ సినిమా విడుదల అయ్యి కూడా రెండు సంవత్సరాలు అయ్యింది.కానీ ఇంతవరకు మరొక సినిమా విడుదల చెయ్యలేదు ప్రభాస్.ప్రస్తుతం ప్రభాస్ చేతిలో నాలుగు పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి.

రాధే శ్యామ్ సినిమా విడుదల చెయ్యాలని భావించిన కరోనా కారణంగా ఆలస్యం అవుతూనే ఉంది.

ఈ సినిమా తర్వాత ప్రభాస్ సలార్, ఆది పురుష్ సినిమాలు స్టార్ట్ చేసాడు.

ఈ రెండు సినిమాలు కొంతమేర షూటింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి.అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ సినిమా తెరకెక్కుతుంది.సలార్ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.

Telugu Salaar, Adhipurush, Corona Wave, Prabhas, Nag Ashwin, Om Rout, Prashant N

ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను హోంబళ్లే ప్రొడక్షన్ బ్యానర్ పై విజయ్ కిరగందుర్ నిర్మిస్తున్నాడు.దీంతోపాటు ప్రభాస్ ఓం రౌత్ దర్శకత్వంలో ఆది పురుష్ సినిమా చేస్తున్నాడు.రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాలో ప్రభాస్ రాముడిగా, బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణాసురుడిగా, కృతి సనన్ సీత పాత్రలో నటిస్తుంది.

అయితే ఈ సినిమాతో పాటు ప్రభాస్ నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో కూడా ఒక సినిమా చేయబోతున్నాడు.వీటి తర్వాత సిద్దార్థ్ ఆనంద్ కూడా లైన్లో ఉన్నాడు.

ఇన్ని సినిమాలు చేతిలో ఉండడం వల్ల ప్రభాస్ మరొక డైరెక్టర్ తో సినిమా చేయాలంటే అంత ఈజీ కాదు.ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ లో ప్రభాస్ మరొక దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఆ సినిమా మొదలు అవ్వాలంటే కనీసం 6 సంవత్సరాలు పట్టిన ఆశ్చర్యం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube