ఆమె నిద్రపోతే లేచేందుకు రోజులు పడుతుంది.. ప్రపంచంలోనే అత్యంత వింతైన మహిళ ఆసక్తికర స్టోరీ

ఈ భూమి మీద కొందరు అత్యంత విచిత్రమైన జబ్బులతో బాధపడుతున్నారు.కోట్లల్లో ఒక్కరు ఇద్దరికి మాత్రమే ఉండే జబ్బులు కొన్ని ఉంటాయి.

 It Takes 10 Days To Wake Up Once She Sleep-TeluguStop.com

వాటిలో ఒకటి బ్రిటన్‌కు చెందిన 21 ఏళ్ల రోడ డియాజ్‌కు ఉంది.ఆమె ఇలాంటి వ్యాధితో బాధపడుతుందని మొదట ఎవరు నమ్మలేదు.

ఆమెను పలువురు వైధ్యులు పరిశీలించి, ఆమెకు సంబంధించిన అనేక రిపోర్ట్‌లను చూసిన తర్వాత ఆమె నిజంగానే ఆ జబ్బుతో బాధపడుతుందని నిర్ధారణకు వచ్చారు.సామాన్యులు ఎవరు కూడా ఆమె జబ్బును నమ్మరు.

ఎందుకంటే ఆమె జబ్బు అలాంటిది మరి.

ఇంతకు ఆమె జబ్బు ఏంటో తెలుసా.నిద్ర, అవును నిద్ర జబ్బు.రోడ నిద్ర పోతే లేచేందుకు కొన్ని రోజలు పడుతుంది.కొన్ని సార్లు వారం పైనే పడుకుని ఉంటుంది.మొదట అంతా కూడా ఆమెది బద్దకం అని, ఆమెకు నిద్ర పిచ్చి అని అంతా అనుకున్నారు.

కాని ఆమెకు తెలియకుండానే రోజుల తరబడి నిద్ర పోతుంది.ఆమె పడుకునే సమయంలో వెంటనే లేవాలని ఎంతగా అనుకున్నా కూడా లేచేప్పటికి రోజులు గడిచి పోతున్నాయి.ఆమె తన నిద్ర వల్ల ఇంటర్‌ పరీక్షలు కూడా రాయలేక పోయింది.పరీక్షలు జరుగుతున్నన్ని రోజులు కూడా ఆమె నిద్రలోనే ఉంది.ఆమె నిద్ర నుండి మేల్కొల్పేందుకు ఎంత ప్రయత్నించినా కూడా ప్రయోజనం ఉండదు.

ఆమె రోజుల తరబడి నిద్ర పోవడంను వైధ్యులు క్లీన్‌ లెవిన్‌ సిండ్రోమ్‌ అని పేరు పెట్టారు.ఇలాంటి జబ్బు ప్రపంచంలో అత్యంత అరుదుగా ఉంటుందని, ప్రస్తుతం ఈ జబ్బుతో బాధపడేది ప్రపంచంలో రోడ మాత్రమే అని నిపుణులు చెబుతున్నారు.ఆమెకు చికిత్స అందించేందుకు పరిశోదనలు చేస్తున్నారు.

ఆమె రోజుల తరబడి నిద్ర పోతున్నా కూడా ఆమె ఇతర ఆరోగ్యం అంతా కూడా బాగానే ఉంది.నిద్ర పోయిన సమయంలో ఆమె ఆహారం తీసుకోకున్నా కూడా పూర్తి హెల్తీగా ఉండటం వైద్యులను సైతం విష్మయంకు గురి చేస్తూంది.

మొత్తానికి ప్రపంచ వైధ్య పరిశోదకులను కూడా రోడ ఆశ్చర్యపర్చుతుంది.

నిద్ర పోవడం అనేది మంచిదే కాని మరీ రోజుల తరబడి నిద్ర పోవడం ఏంట్రా బాబోయ్‌ అనిపిస్తుంది కదా…

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube