సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ లో ఐటీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి.రాజ్ పుష్ప కార్యాలయాలతో పాటు ఎమ్మెల్సీ వెంకట్ రామిరెడ్డి నివాసంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.
అదేవిధంగా వసుధ ఫార్మా, రాజ్ పుష్ఫతో పాటు వెరిటెక్స్ సంస్థల్లో ఆడిట్లను ఐటీ అధికారులు పరిశీలిస్తున్నారు.ఈ క్రమంలో గత ఐదేళ్ల ఐటీ రిటర్న్స్ పై అధికారులు విచారణ చేస్తున్నారు.
కాగా భారీగా పన్నులు ఎగవేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.మొత్తం 50 ప్రాంతాల్లో ఐదు బృందాలుగా విడిపోయి ఉదయం నుంచి దాడులు చేస్తున్నారు.