సీనీ పెద్దల ఇళ్లపై ఐటీ దాడుల కలకలం !  

It Raids In Suresh Productions-

తెలుగు సినీ పెద్దలు ఇళ్లపై ఈ రోజు తెల్లవారుజాము నుంచి ఐటీ దాడులు కొనసాగుతుండడం కలకలం సృష్టిస్తున్నాయి.దగ్గుపాటి సురేష్ కు చెందిన సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయం, రామానాయుడు స్టూడియోలో ఐటీ అధికారులు బృందాలుగా విడిపోయి విస్తృతంగా సోదర నిర్వహిస్తున్నారు.అలాగే సురేష్ ప్రొడక్షన్స్ కార్యాలయంలో కొన్ని కీలక పత్రాలు స్వాధీనం చేసుకుని వాటి గురించి ఆరా తీసే పనిలో పడ్డారు.రామానాయుడు స్టూడియోస్ తో పాటు మొత్తం పది చోట్ల ఈ తనిఖీలు జరుగుతున్నట్టు తెలుస్తోంది వీటితోపాటు హీరోలు, దర్శకనిర్మాతల నివాసాలను ఐటి సోదాలు జరుగుతున్నట్టు సమాచారం.

It Raids In Suresh Productions- Telugu Viral News It Raids In Suresh Productions--It Raids In Suresh Productions-

అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు బయటకు వెల్లడించేందుకు ఐటీ అధికారులు ఇష్టపడడం లేదు.ఇక మరికొంతమంది సినీ పెద్దల ఇళ్లపైనా ఐటీ దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం.ఈరోజు తెల్లవారుజామునుండి మొదలైన సోదాలలో ఆర్థిక లావాదేవీల గురించి ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.సురేశ్ ప్రొడక్షన్స్ లో ఈ మధ్య కాలంలో తెరకెక్కిన సినిమాల ఐటీ రిటర్న్స్ చెల్లించారా లేదా అనే వివరాలు కూడా ఐటీ అధికారులు కూపీ లాగుతున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం సురేశ్ బాబుకు సంబంధించిన అన్ని కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.