తమిళనాడు మంత్రి ఈవీ వేలు ఆస్తులపై ఐటీ దాడులు

తమిళనాడు డీఎంకే నేత, మంత్రి ఈవీ వేలు ఆస్తులపై ఇన్‎కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు కొనసాగుతున్నాయి.

ఈ మేరకు మంత్రి నివాసాలతో పాటు కార్యాలయాల్లో ఐటీ తనిఖీలు చేస్తుంది.

చెన్నై, తిరువన్నామలై, కొయంబత్తూరుతో పాటు కరూర్ లోని సుమారు 60 ప్రాంతాల్లో రెండు వందల మంది ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.తెల్లవారుజాము నుంచి దాడులు కొనసాగుతున్నాయి.

ఇసుక క్వారీలు, విద్యాసంస్థలతో పాటు భవన నిర్మాణాలలో పన్ను ఎగవేతకు పాల్పడ్డారనే ఆరోపణలపై ఐటీ సోదాలు చేస్తుంది.మరోవైపు ఐటీ దాడులను డీఎంకే పార్టీ ఖండించింది.

బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా ప్రతిపక్ష పార్టీలను బెదిరించడానికి కేంద్ర ఏజెన్సీలను వినియోగిస్తుందని తీవ్రస్థాయిలో మండిపడింది.

Advertisement
ఇదేందయ్యా ఇది.. కోవిడ్ 19 థీమ్‌తో పార్కు.. వీడియో చూస్తే నోరెళ్లబెడతారు..

తాజా వార్తలు