ఐటీ శాఖ ఏపీలో హైపర్ టెన్షన్ రేపుతోంది.రాజధానిలో రాత్రి 12 గంటల ప్రాంతంలో చడీ చప్పుడు లేకుండా వాలిపోయిన ఐటీ అధికారులు వారికున్న టార్గెట్ ప్రకారం దూసుకుపోతున్నారు.
ఇప్పటికే తెలంగాణాలో ఐటీ శాఖ రేవంత్ రెడ్డి ,సెబాస్టియన్ ఇళ్ళపై చేసిన దాడుల్లో ఎన్నో కీలక ఆధారాలతో పాటు ఓటుకు నోటు పై కూడా కీలక పత్రాలు అదేవిధంగా రేవంత్ సెబాస్టియన్ వాంగ్మూలాలు కూడా తీసుకుని విజయవాడ వచ్చారని తెలుస్తోంది అయితే ఎటువంటి హంగామా లేకుండా వచ్చిన ఐటీ అధికారులు పోలీసులకి మాత్రం బందోబస్తు కలిపించాలని కోరినట్లుగా తెలుస్తోంది.ఇదిలాఉంటే
గురువారం నెల్లూరులో టీడీపీ నేత బీద మస్తాన్‌రావు కార్యాలయాల్లోనూ ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు.రాత్రి 7 గంటల వరకూ అధికారులు రికార్డుల పరిశీలన చేస్తూనే ఉన్నారు.చెన్నైలోని బీఎంఆర్ సంస్థల కార్యాలయాల్లోనూ వారు ఏకకాలంలో దాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది అయితే అసలు వివరాలు రాబట్టాలని ఎవరు ఎంతగా ప్రయత్నాలు చేస్తున్నా సరే అధికారులు నోరుకూడా మెదపడం లేదట సోదాలు పూర్తి కాగానే మీడియాతో మాట్లాడుతామని అధికారులు తెలుపారట.
అంతేకాదు ఏపీలో ముఖ్యంగా రాజధాని జిల్లాలు కృష్ణా, గుంటూరులో అధికార పార్టీకి సన్నిహితంగా ఉంటున్న ప్రముఖులు, వ్యాపారవేత్తలు, కాంట్రాక్టర్లపై ఒక్కసారిగా విరుచుకుపడేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.అయితే కేవలం ఒక అరగంట ముందు మాత్రమే మీకు తెలుపుతాం అప్పుడు మీరు మాతో కలిసి రండి అని చెప్పారట దాంతో అధికారులు ఎప్పుడు ఎక్కడ దాడులు చేస్తారో తెలియక నేతలకి గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయని ముఖ్యంగా ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే నేతల ఇళ్ళపై ఐటీ దాడులు చేయడానికి సిద్దంగా ఉండనే టాక్ వినిపిస్తోంది.
ఈ క్రమంలోనే నారాయణ సంస్థలపై దాడులు జరుగుతున్నట్లు వస్తున్న వార్త రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.ఇప్పటికే నారాయణ కాలేజ్‌కు ఐటీ అధికారులు చేరుకున్నారు…అయితే ఈ దాడులకి ముందుగానే అధికారులు విజయవాడ ఆటోనగర్‌లోని ఆఫీసులో సమావేశమై సోదాలపై కార్యాచరణ రూపొందించినట్లు తెలుస్తోంది.మొత్తానికి చంద్రబాబు కి రోజులు దగ్గర పడ్డాయని బీజేపీ నేత జీవీఎల్ ముందుగానే ప్రకటించినట్టుగా ఈ దాడులు జరుగుతున్నాయని ఇదంతా కుట్ర పూరితంగా జరుగుతోందని టీడీపీ నేతలు నిరసనలు తెలుపుతున్నారు.