అరెస్ట్ తప్పదా ? : చంద్రబాబు చుట్టూ ఐటీ ఉచ్చు  

It Raids In Chandrababu-

తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అగ్రనేతలే లక్ష్యంగా కొంతకాలంగా ఏపీ లో జరుగుతున్న ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి.కొద్ది రోజుల క్రితం చంద్రబాబు వద్ద పీఎస్ గా పనిచేసిన శ్రీనివాస్ ఇంటిపై ఐటీ అధికారులు దాడులు చేసి పెద్ద మొత్తంలో నగదు డాక్యుమెంట్స్ సంపాదించారు.

IT Raids In Chandrababu-

అప్పటి నుంచి శ్రీనివాస్ ను ఐటీ శాఖ విచారిస్తూనే అనేక లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారంరాబడుతోంది.ఇటీవల హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, పూణే, ఢిల్లీ తదితర నగరాల్లో ఆదాయపన్ను శాఖ దాడులు నిర్వహించింది.

ఈ దాడుల్లో ఏపీ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన మూడు ఇన్ఫ్రా కంపెనీల కార్యాలయాల్లో సోదాలు కూడా చేపట్టింది.

ఈ కంపెనీలు సబ్ కాంట్రాక్టుల రూపంలో భారీగా అక్రమ లావాదేవీలు నడిపినట్లు గా గుర్తించింది.అలాగే అధిక రేట్లకు అక్రమాలకు పాల్పడినట్లు ఐటీ శాఖ గుర్తించింది.అంతేకాకుండా దీనికి సంబంధించి కీలక పత్రాలు, ఖాళీ బిల్లులు, వాట్సాప్ మెస్సేజ్ ల ద్వారా జరిగిన అనేక లావాదేవీలకు సంబంధించి తగిన ఆధారాలను గుర్తించింది.

అసలు ఉనికిలో లేని కొన్ని సంస్థలకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లుగా పత్రాలు సృష్టించి సుమారు రెండు వేల కోట్ల వరకు అక్రమాలకు పాల్పడినట్టు ఐటీ అధికారులు గుర్తించారు.అయితే ఈ నిధులు ఎక్కడి నుంచి ఏ విధంగా దారి మళ్ళాయి అనే విషయం పై ఐటి శాఖ పూర్తిగా ఆరా తీస్తోంది.

ఈ డొల్ల కంపెనీలకు విదేశీ కంపెనీల నుంచి అనుమానాస్పదంగా కోట్లాది రూపాయల పెట్టుబడులు వచ్చినట్లు ఐటీ శాఖ అనుమానిస్తోంది.కొద్ది రోజుల క్రితం చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాస్ ఇంటిపై ఐటి దాడులు జరిగిన సమయంలో ఆయన దగ్గర దొరికిన డైరీ, పర్సనల్ కంప్యూటర్లో మొత్తం దీనికి సంబంధించిన వివరాలు అన్నీ ఉన్నాయట.

అంతే కాకుండా ఆయన ఐటీ శాఖకు అప్రూవర్ గా మారిన ట్లు తెలుస్తోంది.ఆయన ఇచ్చిన సమాచారంతో ఇప్పుడు చంద్రబాబు చుట్టూ ఐటీ శాఖ ఉచ్చు బిగిస్తున్నట్టు కనిపిస్తోంది.

దీంతో ఈ వ్యవహారంలో చంద్రబాబు పూర్తిగా ఇరుక్కునే అవకాశం కనిపిస్తోంది

.

తాజా వార్తలు

It Raids In Chandrababu- Related....