సోనూసూద్ నివాసంలో ఐటి సోదాలు..!!

కరోనా సమయంలో దేశంలో అనేక మంది ప్రజలను వలసదారులను ఆదుకున్న రియల్ హీరో సోను సూద్.ప్రభుత్వాలు కూడా చేయలేని పనులను సోనూసూద్ తన చారిటీ సంస్థ ద్వారా చేయడం జరిగింది.

 It Raids At Sonu Soods Residence-TeluguStop.com

కరోనా కారణంగా వైద్య సదుపాయం లేని వారికి ఆక్సిజన్ సిలిండర్లు అందించడంతో పాటు.పేదలకు అనేక రకాలుగా సహాయాలు చేయడం జరిగింది.

చదువుకోలేని పేద విద్యార్థులకు చదువు అందించడంతో పాటు కొన్ని పేద కుటుంబాలకు ఉపాధి కల్పించారు.అటువంటి సోనుసూద్ పై తాజాగా ఐటీ దాడులు జరగడం దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది.

 It Raids At Sonu Soods Residence-సోనూసూద్ నివాసంలో ఐటి సోదాలు..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

విషయంలోకి వెళితే సోనుసూద్ నివాసంలో ఐటి సోదాలు నిర్వహించారు.బొంబాయి లక్నో లో దాదాపు ఆరు ప్రాంతాలలో ఐటి సోదాలు నిర్వహించడం జరిగింది.

సోను సూద్ కి చెందిన కంపెనీకి, లక్నోలోని ఓ రియలెస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల ఒక డీల్ జరిగింది.ఈ డీల్ అంశంలో ఆదాయపు పన్నును ఎగ్గొట్టారని అందుకే ఆయన పై ఐటి దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

ఓ పక్క కేజ్రీవాల్ తో సోను సూద్ కలవటం వల్లే ఆయనపై కొన్ని రాజకీయ శక్తుల దాడులు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.ఏది ఏమైనా దేశవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను కాపాడి … పేదలకు ఎన్నో సహాయ కార్యక్రమాలు చేసిన సోను సూద్ పై ఐటి దాడులు జరగడం.

దేశంలోనే సంచలనంగా మారింది.

#Sonu Sood #Sonusood #Sonu Sood #Sonusood #Sonusood Poor

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు