ఐటీ రైడ్స్ కి బలైన స్టార్ హీరో నిర్మాత... బాగానే సీజ్ చేశారుగా...

కోలీవుడ్ తలైవా విజయ్ తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు.అయితే ఎప్పుడూ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూ ప్రేక్షకులని అలరించే  విజయ్ గత కొద్దికాలంగా ఇన్ కమ్  టాక్స్ రైడ్లతో సతమతమవుతున్నాడు.

 It Raid In Master Movie Producer Telugustop-TeluguStop.com

దీంతో కొందరు అభిమానులు రాష్ట్రం రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.అంతేకాక విజయం కావాలని కొందరు రాజకీయ నేతలు టార్గెట్ చేస్తున్నారంటూ వాపోతున్నారు.

అయితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తుంటే అది వాస్తవమేనని అనిపించక మానదు.

ప్రస్తుతం విజయ్ “మాస్టర్” అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

ఈ చిత్రానికి తమిళంలో పలు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన లలిత్ కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.అయితే తాజాగా పలువురు ఇన్ కమ్  టాక్స్  అధికారులు లలిత్ కుమార్ ఇంటిపై సోదాలు చేశారని, అంతేకాక ఈ సోదాల్లో దాదాపుగా 75 కోట్ల రూపాయలు విలువచేసే ఆస్తులు మరియు ఒకటిన్నర కేజీ బంగారంను సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ లెక్కలపై ఇన్ కమ్  టాక్స్అధికారులు అధికారికంగా మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.కానీ సోదా చేసినటువంటి వ్యక్తి ప్రముఖ సినీ నిర్మాత అవ్వడంతో కచ్చితంగానే అంత సొమ్ము బంగారం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Telugu Masterlalith, Vijay Master, Vijaymaster-Movie

ఈ విషయం ఇలా ఉండగా విజయ్ తో పాటు విజయ్ కి సంబంధించినటువంటి వ్యక్తుల మీద ఇన్ కమ్  టాక్స్  రైడ్ జరగడం ఈ సంవత్సరంలో ఇది రెండవ సారి.దీంతో పలువురు దర్శక నిర్మాతలు ప్రస్తుత పరిణామాలను బట్టి విజయ్ తో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే భయపడుతున్నారు.మరికొందరు మాత్రం విజయ్ కున్నటువంటి పలుకుబడిని చూసి ఓర్చుకోలేని కొందరు కావాలని విజయ్ పై ఇలాంటి ఇన్ కమ్  టాక్స్  కేసులలో చేయిస్తున్నారని వాపోతున్నారు.అయితే మరోపక్క ఇటీవలే విజయ్ రాజకీయాల్లోకి తెరంగేట్రం చేస్తున్నాడని అందువల్లనే కొందరు రాజకీయాల్లోకి రాకుండా ఆపేందుకు కొందరు ఇలాంటి పన్నాగాలు పన్నుతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు.

 

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube