ఇంకా సినిమా రిలీజే కాలేదు... అప్పుడే నిర్మాత కార్యాలయాల్లో ఐటీ సోదాలు  

It Officers Rides In Maharshi Movie Producer Dil Raju Office-it Officers Rides,maharshi Movie Producer,mahesh Babu,ఐటీ సోదాలు,దిల్ రాజు

టాలీవుడ్ టాప్ మోస్ట్ నిర్మాత గా పేరున్న దిల్ రాజు కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంకా ఆయన తాజాగా నిర్మించిన మహర్షి చిత్రం విడుదల కాకముందే ఆయన కార్యాలయాల్లో ఐటీ సోదాలు నిర్వహిస్తుండడం విశేషం. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మహర్షి చిత్రాన్ని దిల్ రాజు,అశ్వనీదత్,పీవీపీ లు భారీ బడ్జెట్ తో నిర్మించారు..

ఇంకా సినిమా రిలీజే కాలేదు... అప్పుడే నిర్మాత కార్యాలయాల్లో ఐటీ సోదాలు -IT Officers Rides In Maharshi Movie Producer Dil Raju Office

మహేష్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మహేష్ కు జతగా పూజా హెగ్డే నటిస్తుండగా అల్లరి నరేష్ కీలక పాత్రలో నటించారు. రేపు సినిమా విడుదల అవుతున్న ఈ సమయంలో దిల్ రాజు కార్యాలయంలో ఐటీ సోదాలు నిర్వహిస్తుండడం గమనార్హం.

గతంలో కూడా భారీ చిత్రాలు రిలీజ్ అయిన తరువాత, రిలీజ్ అవుతున్న సమయంలో నిర్మాతల ఆఫీసులు, ఇళ్ల పై సోదాలు జరిగిన సంగతి తెలిసిందే.

ఇటీవల కన్నడ లో రిలీజ్ ఆయిన కే.జి.ఎఫ్ మూవీ విపరీతంగా వసూళ్లు రాబట్టింది.

దీనితో ఈ చిత్రం విడుదల అయి విజయవంతంగా ప్రదర్శిస్తున్న సమయంలోనే ఆ చిత్ర నిర్మాణానికి పనిచేసిన పలువురు ఇళ్ల పై ఐటీ సోదాలు నిర్వహించిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అయితే దిల్ రాజు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడానికి ప్రధాన కారణం ఆయన చూపిన ఐటీ రిటర్న్స్ సరిగా లేవని ఈ క్రమంలో ఆయన కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.